తెలంగాణలో మరో ఉద్యోగాల జాతరకు త్వరలోనే సైరన్ మోగనుంది. రాష్ట్రంలో త్వరలోనే 10 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ మేరకు అసెంబ్లీలో ఫిబ్రవరి 10న అసెంబ్లీలో ప్రకటించారు. మన ఊరు-మన బడి మొదటిదశ కింద మరమ్మతులు చేపట్టిన 9,123 పాఠశాలలు జూన్ నాటికి సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులు లేరని ఎక్కడా పాఠశాలలు మూసివేయడం లేదన్నారు. భాషా పండితులు, ఇతర సమస్యలు కొన్ని కోర్టుల్లో ఉండటంతో పరిష్కారం కాకుండా నిలిచిపోయాయని పేర్కొన్నారు. 317 జీవో కింద ఇతర జిల్లాలకు వెళ్లిన వారికి ప్రస్తుత బదిలీల్లో పాత జిల్లాల్లో పోస్టింగ్‌లకు అవకాశాలు ఉన్నాయన్నారు. 


మహబూబాబాద్, కొత్తగూడెంలలో కొత్త ఇంజినీరింగ్ కళాశాలల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలుగు, ఆంగ్ల మీడియం విద్యార్థులకు వేర్వేరుగా బోధించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యా వాలంటీర్ల వేతనాలు ట్రెజరీలో నిలిచిపోయి ఉన్నాయని పరిష్కరించాలని అడిగారు.

కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుపై తేల్చండి..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుపై త్వరగా తేల్చాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గవర్నర్‌ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు రాజ్‌భవన్‌లో పెండింగ్‌ ఉన్నదని, నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని త్వరగా ఆమోదముద్ర వేయాలని కోరారు. పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య పద్దులపై మంత్రి మాట్లాడారు. నాణ్యమైన విద్య అందినపుడే మానవవనరులు అభివృద్ధి చెందుతాయని, దీన్ని బలంగా నమ్మిన సీఎం కేసీఆర్‌ కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యనందిస్తున్నట్టు చెప్పారు. ‘మన ఊరు-మనబడి’ రెండోవిడతలో 9,123 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.2,516 కోట్లతో పనులు చేపడుతామని పేర్కొంటూ అద్భుతంగా తీర్చిదిద్దిన పలు పాఠశాలల ఫొటోలను మంత్రి సభలో ప్రదర్శించారు. ఏటా 2.10 కోట్ల ఉచిత పుస్తకాలు అందజేస్తున్నామని ఆమె వివరించారు.


కేంద్రం వాటా రూ.228 కోట్లే
మధ్యాహ్న భోజన పథకంలో కేంద్ర వాటా రూ.228 కోట్లేనని మంత్రి స్పష్టం చేశారు. 1-8 తరగతులకు రూ.376 కోట్లు, రూ.119 కోట్లు కోడిగుడ్లకు, రూ.240 కోట్లు సన్నబియ్యానికి, రూ.158 కోట్లు 9,10 తరగతుల్లోని విద్యార్థులకు, కుక్‌ కమ్‌ హెల్పర్ల వేతనాల పెంపునకు రూ.130 కోట్లు.. మొత్తం రూ.1,024 కోట్లు ఖర్చు చేస్తుంటే దీంట్లో కేంద్రం వాటా రూ.228 కోట్లు మాత్రమేనని వివరించారు. రాష్ట్రంలో కేజీబీవీలు 475 ఉండగా 245 కేజీబీవీలను ఇంటర్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేశామని, అన్నింటిని అప్‌గ్రేడ్‌ చేయాలంటే కేంద్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భవానికి ముందు గురుకులాల బడ్జెట్‌ రూ.740 కోట్లు ఉంటే, ఈ ఏడాది రూ.3,400 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఇటీవల 14 పాలిటెక్నిక్‌ కాలేజీలు మంజూరు చేశామని, బాసర ఆర్జీయూకేటీలో మౌలిక వసతుల కల్పనకు రూ.50 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. జేఎన్టీయూ సుల్తాన్‌పూర్‌ క్యాంపస్‌ను ఫార్మా వర్సిటీగా మార్చుతామని, మహబూబాబాద్‌, కొత్తగూడెంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.


Also Read:


ఇండియన్ నేవీలో 248 ట్రేడ్స్‌మ్యాన్ స్కిల్డ్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీలో ట్రేడ్స్ మ్యాన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నేవీకి చెందిన నావికాదళ యూనిట్లు/ నిర్మాణ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మార్చి 3 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


C-DAC Recruitment: సీడాక్‌లో 570 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్‌) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 570 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 20లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...