Child Aadhar : ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు ఉచితంగా ఆధార్ రిజిస్ట్రేషన్ పోస్ట్ ఆఫీసుల ద్వారా చేసే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇంటి వద్దకే వచ్చి పిల్లల వివరాలను సేకరించి ఆధార్ రిజిస్ట్రేషన్ ( Aadhar Registration ) చేస్తారు. ఈ ప్రక్రియను తెలంగాణ ( Telangana ) మహిళా శిశు సంక్షేమశాఖతో కలిసి తపాలా శాఖ చేపట్టింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన .. ఐదేళ్ల లోపు పిల్లల ఆధార్ వివరాలను.. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఇంటి వద్దనే ఉచితంగా నమోదు చేస్తామని. .హైదరాబాద్ రీజియన్ పోస్టాఫీస్ విభాగం ప్రకటించింది.
బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు
ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్‌కు పుట్టిన తేదీ ధృవపత్రం ( Birth Cirtificate ) ఉంటే సరిపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని తపాలా కార్యాలయాల్లోనూ ఈ సేవలందిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులతో ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారి అభ్యర్థన మేరకు స్థానికంగా ఉండే తపాలా సిబ్బంది.. చిన్నారుల ఇళ్లకే వచ్చి ఆధార్ నమోదు చేస్తారని తపాలా శాఖ ( Postal Department ) పేర్కొంది. తమ ఇంటి వద్దకు వచ్చిన పోస్టుమ్యాన్‌కు పిల్లల పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఫొటో, బయోమెట్రిక్ తదితర వివరాలను తల్లిదండ్రులు అందజేయాల్సి ఉంటుంది.
పిల్లలను స్కూళ్లలో చేర్చాలనుకుంటే ఆధార్ అవసరం
తెలంగాణలో 1,552 మంది డాక్‌సేవక్‌లు, పోస్ట్‌మ్యాన్‌లు.. పిల్లల ఆధార్ నమోదు సేవల్లో పాల్గొంటారు. పిల్లలను స్కూళ్లలో చేర్చాలనుకుంటున్న తల్లిదండ్రులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని.. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని స్త్రీశిశు సంక్షేమశాఖ, తపాలాశాఖ అధికారులు పిలుపునిచ్చారు.
ఐదేళ్లలోపు పిల్లలకు బాల్ ఆధార్ ( baal Aadhaar ) జారీ
భారతదేశంలో ఆధార్ కార్డు (Aadhaar Card) లేనిదే ఏ పని జరగదు . పిల్లలు కూడా అనేక సందర్భాల్లో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ చూపించాల్సి వస్తుంది. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఐదు ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం బ్లూ ఆధార్ (Blue Aadhaar) లేదా బాల్ (Baal) ఆధార్‌ను జారీ చేస్తోంది. ఇది చిన్న పిల్లలకు ఐడెంటిటీ ప్రూఫ్ లాగా ఉపయోగపడుతుంది. బ్లూ కలర్ (Blue Color)లో ఉండే ఈ ఆధార్ కార్డ్ సాధారణ ఆధార్ కార్డ్‌ల లాగా ప్రత్యేకమైన 12 అంకెల సంఖ్యను కలిగి ఉంటుంది. అయితే దీనికి పిల్లల బయోమెట్రిక్ వివరాలు అవసరం లేదు. ఐదేళ్ల తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటారు.