Fisherman Dies of Heart Attack:  మరికొన్ని రోజుల్లో ఇంట్లో కుమారుడి పెళ్లి ఉంది.. మరోవైపు వివాహ వేడుకల పనులు జరుగుతున్నాయి. అంతా సంతోషంగా ఉన్నారు.. తన రోజువారీ పనుల్లో భాగంగా చేపల వేటకు రిజర్వాయర్‌కు వెళ్లాడు. సరదాగా సాగుతున్న వేట మద్యలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అంతే చెరువులో పడి విగతజీవిగా మారాడు. శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి గుండెపోటు రావడంతో చెరువులో పడి మృత్యువాత పడిన సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.


కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన గోగుల శ్రీను (45) చేపల వేటకు వెళ్లి గుండెపోటు రావడంతో వైరా రిజర్వాయర్‌లో పడి మృతి చెందాడు. శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడి వివాహం మరో వారం రోజుల్లో జరగనుంది. అంతా పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఒకసారిగా విషాద చాయలు అలుముకున్నాయి. శ్రీను వైరా రిజర్వాయర్‌లో సొసైటీలో సభ్యుడు. రోజువారీగా చేపల వేటకు వెళుతుంటాడు. రోజువారీ పనుల్లో బాగంగా చేపల వేటకు బయలు దేరాడు. బయలుదేరే ముందే తనకు ఛాతిలో నొప్పి వస్తుందని భార్యకు చెప్పాడు. అయితే వెళ్లవద్దని భార్య వారించింది. అయితే ఏమి కాదని చెప్పిన శ్రీను వెటకు బయలుదేరాడు. 

ఉపాధి ఇచ్చిన చెరువులోనే విగతజీవిగా..

ఉదయం చేపల వేటకు వెళ్లిన శ్రీను సాయంత్రం వరకు రాకపోవడం, ఉదయం వెళ్లే సమయంలో తనకు ఛాతిలో నొప్పిగా ఉందని భార్యకు చెప్పడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ అతను కనిపించకపోవడంతో చెరువులో వెతికారు. చివరకు చెరువు పక్కన శవమై కనిపించాడు. రోజువారీ ఉపాధి కోసం చేపల వేట చేస్తున్న చెరువులోనే శ్రీను మృత్యువాతపడ్డాడు. చేపల వేటకు వెళ్లిన క్రమంలో గుండెపోటు రావడంతో చెరువులో పడి మృత్యువాతపడ్డాడు. మరో వారం రోజుల్లో వివాహం జరగాల్సిన ఆ కుటుంబంలో పెద్ద దిక్కు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోజువారీగా తమతో పాటు చేపల వేటలో పాల్గొనే శ్రీను మృతి చెందడం తోటి మత్స్య కార్మికులకు ఆవేదనను మిగిల్చింది.
Also Read: Nellore Kidnap: సినిమా స్టైల్ లో వ్యాపాారి కిడ్నాప్.. ఛేజ్‌ చేసి పట్టుకున్న పోలీసులు 
Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం
Also Read: Omicron Cases in India: దేశంలో 200 దాటిన ఒమిక్రాన్ కేసులు.. 3 రోజుల్లోనే డబుల్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి