తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ( TRS )మరోసారి ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయిచింది.  ఏప్రిల్ 27వ తేదీన మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ప్లీనరీ సమావేశం నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం. 2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ ను ప్రకటించారు కేసీఆర్ ( KCR ) .  ఈ ఏడాదికి 21 ఏళ్లు అవుతుంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ నిర్వహిస్తూ ఉంటారు. మొదట ప్లీనరీ ఆ తర్వాత  భారీ బహిరంగసభ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా  నిర్వహించలేకపోయారు. కానీ హుజురాబాద్ ఉపఎన్నికకు ముందు అక్టోబర్ చివరి వారంలో హెచ్‌ఐసీసీలోనే నిర్వహించారు. 


నిజామాబాద్ బీజేపీలో వర్గపోరు, ధన్ పాల్ పై చేయి చేసుకున్న ఎండల
    
వ్యవస్థాపక దినోత్సవానికి పరిమితంగానే ఆహ్వానాలు పంపుతున్నారు. రాష్ట్ర మంత్రి వర్గంతో పాటు రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధఉలు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులు ఉన్న వారు, జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులు అందర్నీ ఆహ్వానిస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజున ఉదయం 11:05 గంటలకు అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగం ఉంటుంది.  దాదాపు 11 తీర్మానాలు ప్రవేశపెట్టి వాటి పై చర్చించి ఆమోదిస్తారు.  


తల్లీకొడుకుల ఆత్మహత్య - రామాయంపేట మున్సిపల్ చైర్మన్ సహా ఏడుగురిపై కేసు నమోదు, పరారీలో నిందితులు


గత అక్టోబర్‌లో ప్లీనరీ అయిపోయిన తర్వాత వరంగల్‌లో  భారీ బహిరంగసభ నిర్వహిచాలనుకుకున్నారు. ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాయిదా వేశారు. ఆ తర్వాత ఆ సభ నిర్వహించలేదు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తారేమోనని టీఆర్ఎస్ క్యాడర్ అనుకున్నారు . అయితే ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా హెచ్‌ఐసీసీకే పరిమితం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. బహిరంగసభ ఆలోచన చేయలేదు. 


కేసీఆర్‌కు బండి సంజయ్‌ ఓపెన్ లెటర్‌, చర్చకు ఎప్పుడు వస్తారంటూ సవాల్


ప్రస్తుతం జాతీయ రాజకీయాల విధానాల రూపకల్పనలో కేసీఆర్ బీజీగా ఉన్నారు.  రైతు పాలసీని ఆయన ఖరారు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. మరోసారి ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో బీజేపీయేతర ముఖ్యమంత్రులతో భారీ బహిరంగసభను తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం బహిరంగసభ ఆలోచనను పక్కన పెట్టినట్లుగా చెబుతున్నారు.  పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని క్యాడర్ వారి వారి గ్రామాల్లోనే జెండా ఆవిష్కరణల ద్వారా చేసుకోనుంది.