భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల ఇరవయ్యో తేదీన తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శలు చేపట్టాలని .. దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశంర జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని రైతులకు తెలియ చెప్పాలని పార్టీ నేతలను ఆదేశించారు.
Also Read: కరోనా కాలం చదవులా ? ఇంటర్ బోర్డు పొరపాటా? వివాదంగా మారిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు !
రాష్ట్ర ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు కోసం అన్నిరకాల ప్రయత్ాలు చేస్తున్నామన్నారు. శనివారం ఢిల్లీకి మంత్రుల బృందాన్ని కూడా పంపుతున్నామని కేసీఆర్ తెలిపారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణ అంశంపైనా కేంద్రం తీరుపై కేసీఆర్ అసంతృ్పతి వ్యక్తం చేశారు. రైతుబంధు పథకం యథావిధిగా కొనసాగుతోందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇతర పంటలు వేసేలా రైతుల్లో చైతన్యం తేవాలని సూచించారు. వరి రైతులకు రైతు బంధు పథకం ఇవ్వరని జరుగుతున్న ప్రచారం కారణంగాఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. దళిత బంధుపై విపక్షాల ప్రచారం తిప్పికొట్టాలని ఆదేశించారు. ఈ పథకాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Also Read: హెల్మెట్, మిర్రర్స్ లేవా పుష్ప... సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం
నిరంతరం ప్రజల్లో ఉండాలని, కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిపించుకునే బాధ్యత తనదే అని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైనా కేసీఆర్ ఆరా తీశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరగడంపై పార్టీ నేతల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికను పర్యవేక్షించిన మంత్రి అజయ్.. కీలకమైన నేతలను సమావేశానికి తీసుకు వచ్చారు. ఎవరెవరుక్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారో ఆయన సీఎంకు వివరించినట్లుగా చెబుతున్నారు.
Also Read: ఇక బీజేపీది ప్రభంజనమే.. కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటానన్న ఈటల రాజేందర్ !
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీఎంపీ ఒకరు తన వర్గంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారని చెప్పినట్లుగా సమాచారం. ఎవరెవరు క్రాస్ ఓటింగ్ చేయించారో.. వారి వెనుక ఎనరున్నారో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ హఠాత్తుగా పూర్తి స్థాయి సంయుక్త కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం... బీజేపీపై పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించడంతో టీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ వచ్చినట్లయింది.