Kavitha : మహిళా రిజర్వేషన్ల ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేయాలని భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కార్యాచరణ ప్రకటించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో , ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విస్మరించినందున ఆందోళనని మరింత తీవ్ర రూపం చేయాలని నిర్ణయించారు.
అందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు. మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతోపాటు దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు చర్చలు నిర్వహించనున్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా కవిత ప్రణాళిక రూపొందించారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు పంపనున్నారు. మహిళా బిల్లు ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టర్ ను విడుదల చేశారు. మహిళలకు సాధికారత కల్పిద్దాం, దేశానికి సాధికారత కల్పిద్దాం. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి... మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు అని పోస్టర్ లో పేర్కొన్నారు.
పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం కోసం ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగాలని గతంలోనే నిర్ణయించుకున్నారు. పార్లమెంటు బయట బిల్లుకు మద్దతు కూడగట్టడం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతో పాటు పార్లమెంటు లోపల కూడా ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లు, జీరో అవర్‌లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. పార్లమెంటు బయట ఎలా కొట్లాడాలో రైతులు తమకు మార్గం చూపించారని గతంలో కవిత ప్రకటించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మహిళలు చేసే పోరాటానికి ప్రతి పార్టీ, ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కవిత ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. బిల్లు ఆమోదం పొందే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మహిళా బిల్లు కోసం కవిత చేస్తున్న పోరాటానికి పెద్ద ఎత్తున ప్రాంతీయ పారటీలు మద్దతు పలుకుతున్నాయి. వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో సీపీఐ ఎంపీ గీతాముఖర్జీ దేశమంతా తిరిగి మహిళల స్థితిగతులపై అధ్యయనం చేసి పార్లమెంటుకు నివేదిక ఇచ్చారు. ఆ తరువాత దేవెగౌడ హ యాంలో కొన్ని రాజకీయ పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. మన్మోహన్‌సింగ్, దేవెగౌడ, గుజ్రాల్ ప్రధానులుగా ఉన్నప్పుడు ఆయా ప్రభుత్వాలకు పూర్తి స్థాయి సంఖ్యాబలం లేదు. కానీ మోదీ ప్రభుత్వానికి పూ ర్తిస్థాయి మెజారిటీ ఉన్నది. మోదీ సర్కారు బిల్లు తేవడానికి ఇష్టపడటం లేదు. బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు తెస్తే సమర్థిస్తామని అన్ని పార్టీలు చెబుతున్నాయి. దీంతో కవితకు మద్దతు పెరుగుతున్నట్లయింది.