ఆన్ లైన్‌లో పరిచయం కాస్తా కడపకు చెందిన సుహాసినిని, హుజురాబాద్‌కు చెందిన సుజిత్‌ను కలిపింది. మాయమాటలతో నమ్మించి పెళ్లి, కట్నం అంటూ లక్షలు కాజేసిన సుజిత్, చివరికి అగ్రిమెంట్ రాసి జంప్ అయ్యాడు. న్యాయం కోసం ఆమె హుజూరాబాద్‌లో మౌనదీక్ష చేపట్టింది. 42 రోజుల దీక్ష అనంతరం తాజాగా ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మోసం చేసిన భర్త ఆచూకీ ఎలాగో తెలుసుకొని చివరి వరకూ పోరాడి ఓడిపోయింది. తనను భార్యగా స్వీకరించాలనే డిమాండ్‌తో చేసిన పోరాటం చివరికి విషాదాంతంగానే ముగిసింది.
హుజూరాబాద్‌కు చెందిన సుజిత్ హన్మకొండలోని ఓ ఆసుపత్రిలో పని చేస్తుండగా కడప జిల్లాకు చెందిన ఆవుల సుహాసిని అనే 34 ఏళ్ల వ్యక్తితో ఆన్ లైన్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకొని 2020 నవంబర్ 25న హైదారాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు కాపురం చేసిన తర్వాత సుజిత్ తన భార్యకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. భర్తపై ఉన్న ప్రేమను చంపుకోలేక అతనే కావాలంటూ ఆ యువతి చివరికి అతని ఆచూకి కనుక్కుంది.
భర్త తనకు కావాలంటూ హుజూరాబాద్‌లోని సుజిత్ ఇంటి ఎదుట నవంబర్ 26 నుంచి దీక్ష చేస్తోంది. అయినా అత్త తరపు వారి నుంచి ఎలాంటి ఆదరణ లేదు. చివరకు పోలీసులను ఆశ్రయించింది. న్యాయం కోసం పోరాడింది. కొన్ని రోజులపాటు పస్తులు ఉండి తన దీక్ష కొనసాగించింది. చివరికి భర్త మరో పెళ్లి చేసుకున్నాడని, వారికి పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకుంది. చేసేదిలేక బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించగా గురువారం మృతి చెందిందని పోలీసులు తెలిపారు. అంతకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో.. తన మృతికి భర్త సుజిత్, అత్త పద్మ, కల్యాణి, మామ శ్రీనివాస్ రెడ్డి, మరిది సుహాస్ రెడ్డి కారణమని పేర్కొంది.
Also Read: Crime News: మంటల్లో కాలిపోతున్న భర్త.. చోద్యం చూస్తూ నుంచున్న భార్య, కొడుకు.. అసలేం జరిగిందంటే..
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!
Also Read: Suryapet: సూర్యాపేటలో కిరాతక హత్య, బురదలో పడేసి.. ట్రాక్టర్ దమ్ము చక్రాలతో తొక్కించి..
Also Read: Pigeon News: భయపెడుతున్న పావురాలు.. కాలికి పసుపురంగు ట్యాగ్, దానిపై ఆ కోడ్ ఏంటి? అక్కడ కూడా ఇలాగే..