KTR Japan company :    తెలంగాణ‌లో జ‌ప‌నీస్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ సంస్థ‌ DAIFUKU భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. హైద‌రాబాద్‌లోని చంద‌న‌వెల్లిలో  DAIFUKU మాన్యు ఫ్యాక్చ‌రింగ్ యూనిట్‌ను ఏ రూ. 450 కోట్ల‌తో యూనిట్‌ను ఏర్పాటు చేయ‌నుంది. సుమారు 800 మందికి పైగా ప్ర‌త్య‌క్షంగా ఉపాధి క‌ల్పించ‌నుంది. ఈ మేర‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో DAIFUKU ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఆటోమేటెడ్ స్టోరెజ్ సిస్ట‌మ్స్‌, క‌న్వేయ‌ర్లు స‌హా ఆటోమేటిక్ స్టార్ట‌ర్స్ వంటి ప‌రిక‌రాల‌ను ఈ సంస్థ త‌యారు చేస్తోంది. 





2 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ పెంచి అత్యాధునిక ప‌రిశ్ర‌మ‌ను స్థాపించ‌నుంది. మొద‌టి ద‌శ విస్త‌ర‌ణ కోసం రూ. 200 కోట్ల ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మైన పెట్టుబ‌డికి ప్ర‌ణాళికలు రూపొందించింది. రాబోయే 18 నెల‌ల్లో నూత‌న ప‌రిశ్ర‌మ‌ను ప్రారంభించాల‌నే యోచ‌న‌లో ఉంది. క‌రోనా త‌ర్వాత పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు రావ‌డం సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ అన్నారు. అనేక మాన్యుఫ్యాక్చ‌రింగ్ యూనిట్లు హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నాయ‌న్నారు. జపాన్ అద్భుత‌మైన టెక్నాల‌జీ ఉప‌యోగించుకొని ముందుకు వెళ్తుంద‌న్నారు. దండు మైలారంలో అతిపెద్ద పారిశ్రామిక పార్కు తీసుకొచ్చామ‌న్నారు.


తెలంగాణ రాష్ట్రంలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత అత్యంత వేగంగా, తక్కువ సమయంలో ఈరోజు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం పట్ల హర్షం జపాన్ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది.  ఇంత వేగంగా పనిచేసిన ప్రభుత్వ యంత్రాంగం పనితీరు పట్ల మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఇండియాలో త‌మ ఉత్ప‌త్తుల త‌యారు వేగ‌వంతం చేస్తామ‌ని సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ గ‌రిమెళ్ల స్ప‌ష్టం చేశారు. క‌స్ట‌మ‌ర్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎక్కువ సామ‌ర్త్యంతో ఉత్ప‌త్తులు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్ అని కొనియాడారు. చంద‌న‌వెల్లిలో మాన్యుఫ్యాక్చ‌రింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామ‌న్నారు.
  
ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు దృష్టి సారించిన చైనా ప్లస్ 1 ఆలోచనను భారతదేశం అందిపుచ్చుకోవాల్సి ఉందని కేటీఆర్ అన్నారు. ఇతర దేశాల్లోని తయారీ సంస్థలన్నీ కూడా భారతదేశంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అత్యంత ఆసక్తిగా చూపుతున్నాయన్నాకుయ  పూర్తిస్థాయిగా చైనా పైన ఆధారపడకుండా ఇతర దేశాల్లోనూ తమ తయారీ సంస్థలను ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని.. చైనా తో పోల్చుకున్నప్పుడు ఇక్కడి ప్రజాస్వామ్యం ,  అతిపెద్ద మార్కెట్ అద్భుతమైన మానవ వనరులు భారతదేశానికి ఉన్న కీలక అనుకూలతలని కేటీఆర్అన్నారు. భారతదేశాన్ని ఒకే గాటన కట్టకుండా దేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల పారిశ్రామిక పాలసీలు పరిపాలన విధానాలను దృష్టిలో ఉంచుకోవాలని పారిశ్రామిక వేత్తలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.