తెలంగాణలో ఖనిజ నిక్షేపాలకు కేరాఫ్‌గా నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బొగ్గు నిక్షేపాలతోపాటు రాగి గనులు ఉన్నాయి. ఐదు దశాబ్ధాల క్రితమే ఇక్కడ ఏర్పాటు చేసిన రాగి గనులను అధికారులు అర్థాంతరంగా మూసివేశారు. ఇప్పటి వరకు వాటిని పునః ప్రారభించేవారే కరవయ్యారు.
రాగి గనులు ఏర్పాటు చేస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు గిరిజనులు. కానీ ఆ ఆశలు ఇప్పటికీ నెరవేరడం లేదంటున్నారు. కొత్తగూడెం పట్టణానికి 22 కిలోమీటర్ల దూరంలోని మైలారం ప్రాంతంలో 1963లో రాగి నిక్షేపాలను గుర్తించారు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు ఇక్కడ మైనింగ్ నిర్వహించింది ప్రభుత్వం. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అర్థాంతరంగా మైనింగ్ కార్యకలాపాలు నిలిపివేసింది.
అప్పట్నుంచి ఎప్పుడెప్పుడు మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయా అంటూ ఎదురు చూస్తున్నారు గిరిజనులు. వాళ్ల ఆసలు ఇప్పటికీ నెరవేరలేదు. నిరీక్షణే మిగులుతోంది.
రాగి గనులను ప్రారంబిస్తే తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడుతున్నారు గిరిజనం. స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని భావిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గనులు ఏర్పాటు చేయడం వల్ల తమ ప్రాంతానికి అనేక సౌకర్యాలు కలుగుతాయంటున్నారు.
ఖనిజ నిక్షేపాలు ఉన్న చోట మైనింగ్ ఏర్పాటు చేస్తే అటు ప్రభుత్వానికి ఆదాయం రావడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయినా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ఆ దిశగా దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇక్కడ కాపర్ మైనింగ్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి సూచిస్తున్నారు.
Also Read: తెలంగాణలో తగ్గుతున్న కోవిడ్ వ్యాప్తి, కొత్తగా 1,061 కేసులు, ఒకరు మృతి
Also Read: భాగ్యనగరికి మరో మకుటం! తెలంగాణకు 'బాష్' రానుందన్న కేటీఆర్
Also Read: తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శం, సంసద్ గ్రామాల్లో వెన్నంపల్లి టాప్
Also Read: బలిదానాలకు బీజేపీదే బాధ్యత -మోదీ క్షమాపణలు చెప్పాలన్న రేవంత్ , హరీష్ రావు !