ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫీజుల తేదీలను బోర్టు ఖరారు చేసింది. ఫీజు చెల్లించకుంటే.. ఆలస్య రుసుముతో.. ఫిబ్రవరి.. 21 వరకు.. ఫీజు చెల్లించే అవకాశం ఉందని.. ఇంటర్ బోర్డు తెలిపింది. 


ఆలస్య రుసుము 100 రూపాయలతో ఈనెల 25 నుంచి 31 వరకు చెల్లించొచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు చెల్లించే అవకాశం ఉంది. రూ.1000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు ఉంటుంది. రూ.2 వేలతో ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. మొదటి సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్​మెంట్ రాసుకునే ఛాన్స్ ఉంది. 


ఇటీవల ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో.. మొదటి సంవత్సర పరీక్షల్లో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో బోర్డుపై విమర్శలు వెల్లువెత్తాయి. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.  ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గిన నేపథ్యంలో పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. 


కరోనా కారణంగా నేరుగా తరగతులు నిర్వహించకపోవడం.. తొలుత పరీక్షలను రద్దు చేసిన సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేయడం.. ఆ తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించడం వంటి పరిస్థితుల్లో విద్యార్థులు గందరగోళానికి లోనయ్యారని వాదనలు వినిపించాయి.


గతంలో విడుదల చేసిన ఫలితాల్లో.. జనరల్‌, ఒకేషనల్‌ కలిపి 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. గతేడాదితో పోలిస్తే ఏకంగా 11 శాతం ఉత్తీర్ణత తగ్గడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మొత్తం జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు 5.59 లక్షల మందికి 2.24 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు.


Also Read: Covid Updates: తెలంగాణలో కోవిడ్ విజృంభణ... ఒక్క రోజే 1052 కరోనా కేసులు... కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు


Also Read: JP Nadda In Hyderabad: బీజేపీ ధర్మయుద్ధం చేస్తోంది... తెలంగాణలో నియంతృత్వ పాలన... కేసీఆర్ పై జేపీ నడ్డా ఫైర్


Also Read: Hyderabad Crime: అర్ధరాత్రి అక్కతో గొడవపడి బయటకొచ్చిన బాలిక... ఇంట్లో బంధించి లైంగిక దాడి చేసిన ఆటోడ్రైవర్... ఆపై మరింత దారుణంగా...


Also Read: Nizamabad Crime News: కోడలి అక్రమ సంబంధం.. విషయం అత్తకు తెలిసింది.. ఏంటీ పని అంటూ నిలదీసింది.. చివరకు


Also Read: Telangana Schools: సెలవుల్లోపు విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి... పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయండి... మంత్రి సత్యవతి రాథోడ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి