తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గతేడాది జూన్ తర్వా తొలిసారి రాష్ట్రంలో 1000 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,991 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 1,052 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,84,023కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌ లో ఈ గణాంకాలు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4,033కి చేరింది. కరోనా నుంచి మరో 240 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,858 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని  వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


కొత్తగా 10 ఒమిక్రాన్‌ కేసులు..


రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 10 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 144కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి 127 మంది శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారందరికీ కోవిడ్‌ ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించి పరీక్షలు చేయిస్తున్నారు. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి 13,405 మంది ప్రయాణికులు హైదరాబాద్ వచ్చారు. వీరందరికీ కోవిడ్ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా 189 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరి శాంపిల్స్ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వారిలో 45 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌ అని తేలింది. మిగిలిన 144 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకూ ఒమిక్రాన్‌ బాధితుల్లో 37 మంది కోలుకున్నారు. మరో 50 మంది ఫలితాలు రావాల్సి ఉంది. 


Also Read: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. థర్డ్ వేవ్ వైపు పయనిస్తున్నామా?


ఏపీలో కరోనా కేసులు


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 28,311 మందికి కరోనా పరీక్షలు చేశారు. 334 మందికి వైరస్ సోకింది. వైరస్ కారణంగా.. ఒకరు చనిపోయారు. కరోనా నుంచి మరో 95 మంది బాధితులు బయటపడ్డారు. ప్రస్తుతం ఏపీలో 1,516 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Also Read: Vizianagaram: విజయనగరం జిల్లాలో కరోనా కలకలం... కొత్తవలస పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఒక టీచర్ కు పాజిటివ్


దేశంలో కరోనా కేసులు 


దేశంలో ఒమిక్రాన్, కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1892కు పెరిగింది. మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 37,379 కరోనా కేసులు నమోదయ్యాయి. 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 124 మంది వైరస్‌తో మృతి చెందారు.




  • డైలీ పాజిటివిటీ రేటు: 3.24%

  • యాక్టివ్ కేసులు: 1,71,830

  • మొత్తం వ్యాక్సినేషన్: 1,46,70,18,464


Also Read: జగన్ మళ్లీ అధికారం చేపట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.... డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి