హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఇంట్లో గొడవపడి బయటకు వచ్చిన బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు కామాంధులు. అంతటితో ఆగకుండా బాలికకు మత్తు మందు ఇచ్చి వ్యభిచారం చేయించారు. హైదరాబాద్ పాతబస్తీ కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన బాలిక నవంబర్ 20న తన అక్కతో గొడవ పడి బయటకొచ్చింది. బయటకు వచ్చిన బాలికపై లైంగిక దాడికి పాల్పడి, వ్యభిచారం చేయించారు. ఈ ఘటనపై బాలిక తల్లి బహదూర్ పురా పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సమాచారం మేరకు పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి బాలికను రక్షించారు.
Also Read: కోడలి అక్రమ సంబంధం.. విషయం అత్తకు తెలిసింది.. ఏంటీ పని అంటూ నిలదీసింది.. చివరకు
అసలేం జరిగిందంటే....
నవంబర్ 20న ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలికను కొందరు యువకులు వెంబడిస్తుంటే ఓ ఆటో డ్రైవర్ బాలికను రక్షించాడు. బాలిక గురించి ఆటో డ్రైవర్ ఆరా తీయగా ఇంటికి వెళ్లనని చెప్పింది. ఆటో డ్రైవర్ సమీర్, అతడి స్నేహితుడు హఫీజ్‌తో కలిసి బాధితురాలిని అత్తాపూర్పరిధిలోని ఉప్పర్‌పల్లిలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్లిద్దరూ బాలికపై లైంగిక దాడి చేశారు. మైలార్‌దేవ్‌పల్లిలో మరో ఇద్దరు మహిళల సాయంతో ఓ ఇంట్లో ఉంచి వ్యభిచారం చేయించారు. ఈ కేసు వివరాలను బహదూర్ పురా సీఐ దుర్గా ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. బాలికకు మత్తు మందు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. బాలిక మిస్సింగ్ కేసులో దర్యాప్తు బహదూర్ పురా పోలీసులు... బాధితురాలి అక్క ఫోన్‌కు బాలిక లోకేషన్ పంపింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మైలార్దేవ్ పల్లి అలీనగర్‌లోని సోదాలు నిర్వహించి బాలికను రక్షించారు. అక్కడే ఉన్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: అసలేంటి ఈ 'బుల్లి బాయ్' లొల్లి.. అంతా చేసింది మహిళేనా?
'బాలిక ఇంట్లో అక్కతో గొడవపడి నవంబర్ 20న ఇంటినుంచి వెళ్లిపోయింది. బాలిక మిస్సింగ్ పై చిన్నారి తల్లి డిసెంబర్ 1న ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. బాలిక తన అక్కకు ఇన్‌స్టాగ్రామ్‌లో లోకేషన్ పంపంది. ఆ లోకేషన్ కు వెళ్లి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నాం. ఆటో డ్రైవర్ సమీర్, అతని స్నేహితుడు పరారీలో ఉన్నాడు. కొంతమంది అబ్బాయిలు బాలికను వెంబడిస్తుంటే ఆటోలో ఉన్న వ్యక్తిని సాయం కోరింది. అదే అదునుగా తీసుకుని బాలికను సమీర్, హఫీజ్‌తో కలిసి అత్తాపూర్‌కు తీసుకెళ్లారు. తర్వాత మైలార్‌దేవ్‌పల్లికి బాలికను తరలించి వ్యభిచారం చేయించారు' అని బహదూర్ పురా సీఐ దుర్గా ప్రసాద్ తెలిపారు.
Also Read: కుమార్తెను కొట్టిందని టీచర్‌పై జవాన్ కాల్పులు .. కానీ గాయపడింది ఆయన భార్య ! ఎలా అంటే ...