కాంగ్రెస్ సహా.. ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరే ఆలోచన లేదని ఇందిరా శోభన్ అన్నారు. ప్రజా సమస్యలే అజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్దమవుతున్నట్లు చెప్పారు. హరీష్ రావు భుజాలపై తుపాకీ పెట్టి ఈటల రాజేందర్‌ను కాల్చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక బాధ్యతలు కేటీఆర్‌కు ఎందుకు ఇవ్వటం లేదో కేసీఆర్ చెప్పాని డిమాండ్ చేశారు. ఆ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. నిరుద్యోగుల తరఫున మాత్రమే పోరాటం చేస్తానన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా  మార్చిన ఘనత కేసీఆర్, హరీశ్ రావుకు దక్కుతుందని ఇందిరా శోభన్ విమర్శించారు.


Also Read: Vijayashanthi: కేసీఆర్ మైండ్ బ్లాంక్ అవుతుంది.. ఇక అవేం పని చేయవు, బండి సంజయ్‌పై విజయశాంతి పాటలు విడుదల


                  TS EAMCET Results 2021: ఫలితాలు వచ్చాయి.. కానీ వెబ్‌సైట్‌ ఓపెన్ అవట్లేదు..


'ప్రస్తుతానికి నేను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు. ఉద్యోగాలు కోల్పోయిన ఫీల్డ్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, విద్యా వాలంటీర్లు, జూనియర్ లెక్చరర్ల సమస్యను హుజtరాబాద్ వేదికగా లేవనెత్తబోతున్నాం. వారికి అండగా ఉండేందుకే ఉపాధి భరోసా యాత్ర చేస్తున్నాం. నియామకాలు చేపట్టకపోగా.. విధుల నుంచి తొలగించే హక్కు సీఎంకు ఎక్కడిది. ఇచ్చే వాడికి హక్కు ఉంటుంది. కేసీఆర్ ఉద్యోగాలే ఇవ్వలేదు.. అటువంటప్పడు ఎలా తొలగిస్తారు. ఉద్యోగాల నుంచి 54 వేల మందిని తొలగించారు. పని చేసిన వారికి జీతాలు కూడా ఇవ్వలేదు.' అని ఇందిరా శోభన్ చెప్పారు.


Also Read: Jagan Bail CBI Court : "తీర్పు" సెప్టెంబర్ 15కి వాయిదా !


KTR Words Hot Topic : కేటీఆర్ అలా ఎందుకన్నారు ? అన్ని పార్టీల నేతల్లోనూ ఇదే డౌట్..!


వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఇటీవలే ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ‘షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశాను. నాకు మద్దతుగా నిలిచిన, ప్రోత్సహించిన వైఎస్ షర్మిలక్కకు ధన్యవాదాలు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలని కలలుగన్నం. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రజలతో మమేకమైన నన్ను.. మీరంతా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. అభిమానులు, తెలంగాణ ప్రజల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను’అని ఇందిరా శోభన్ తెలిపారు.


Also Read:VC Sajjanar IPS: వీసీ సజ్జనార్ ఆకస్మిక బదిలీ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం, కొత్త అపాయింట్‌మెంట్ ఎక్కడంటే..