తెలంగాణ ఎంసెట్ 2021 ఫలితాలు కొద్ది గంటల క్రితం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంసెట్ ఫలితాలను తెలంగాణ ఎంసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.in లో చూడవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే ఫలితాల విడుదలకు దాదాపు మూడు గంటల ముందు (ఉదయం 9 గంటల నుంచి) నుంచే ఈ వెబ్‌సైట్ పనిచేయడం లేదు.


ఫలితాల కోసం విద్యార్థులంతా ఒక్కసారిగా ఎంసెట్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయడంతో భారీగా ట్రాఫిక్ పెరిగింది. దీంతో వెబ్‌ సైట్‌ తెరవడానికి ప్రయత్నిస్తే ఎర్రర్ మెసేజ్ దర్శనమిస్తోంది. ఫలితాలు విడుదలై మూడు గంటలు దాటుతున్నా ఇంకా మార్కులను తెలుసుకోలేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం అధికారులు ఈ సమస్యను పరిష్కరించే పనిలో పడ్డారు. మరికాసేపట్లో వెబ్‌సైట్‌ ఓపెన్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 



Also Read: TS EAMCET Results: టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇంజనీరింగ్‌లో 82.08 శాతం మంది క్వాలిఫై


విడుదలైన ఫలితాలు.. 
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈరోజు (ఆగస్టు 25) విడుదలయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 82.08 శాతం మంది క్వాలిఫై అయ్యారు. 1,47,991 మంది హాజరైతే 1,21,480 మంది అర్హత సాధించారు. ఇక అగ్రికల్చర్ విభాగంలో 92.48 శాతం మంది అర్హత సాధించారు. ఈ పరీక్షలకు మొత్తం 79009 మంది హాజరవ్వగా 73070 మంది క్వాలిఫై అయ్యారు. 


ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 5 ర్యాంకర్లు.. 



  1. సత్తి కార్తికేయ (ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా)

  2. దుగ్గినేని వెంకట పణీశ్‌ (రాజంపేట కడప)

  3. మహ్మద్ అబ్దుల్ ముకీత్ (హైదరాబాద్ టోలిచౌకీ)

  4. రామస్వామి సంతోష్ రెడ్డి (నల్లగొండ జిల్లా పోచంపల్లి)

  5. జోష్యుల వెంకట ఆదిత్య (హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి) 


అగ్రికల్చర్ విభాగం టాప్ 5 ర్యాంకర్లు..



  1. మండవ కార్తికేయ (హైదరాబాద్ బాలనగర్)

  2. ఇమాని శ్రీనిజ (రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట)

  3. తేరుపల్లి సాయి కౌశల్‌రెడ్డి (హైదరాబాద్ కూకట్ పల్లి)

  4. రంగు శ్రీనివాస కార్తికేయ (ఏపీలోని అనంతపురం జిల్లా)

  5. చందం విష్ణు వివేక్‌ (ఏపీలోని రాజమహేంద్రవరం)


Also Read: TS EAMCET Toppers: టీఎస్ ఎంసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల హవా.. టాప్ 10 ర్యాంకర్ల వివరాలు


Also Read: TS Eamcet counselling: మరో 5 రోజుల్లో టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్.. ముఖ్యమైన తేదీలివే..