KCR In Patna :  అమర జవాన్ల త్యాగం వెలకట్టలేనిదని.. వారికి అండగా తామున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. గల్వాన్ లోయలో అమరురైన బీహర్ సైనికుల కుటుంబాలకు సాయం అందించేందుకు కేసీఆర్ పట్నాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు.  బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో కలిసి గల్వాన్‌ లోయలో మరణించిన ఐదుగురు బీహార్‌ సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. అదేవిధంగా సికింద్రాబాద్‌ టింబర్‌ డిపోలో ఇటీవల మరణించిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.  


అమర జవాన్ల త్యాగం వెలకట్టలేనిది - బీహార్ కార్మికులకు అండగా ఉంటాం !


అమర జవాన్ల త్యాగం వెలకట్టలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు. వారికి అండగా తాముంటామనిప్రకటించారు. దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన వారి కుటుంబంాలకు తాముంటామన్ారు. వారికి ఆర్థిక సాయం చేయడం తమ కనీస ధర్మమని కేసీఆర్ తెలిపారు. మన దేశాన్ని.. కాపాడేందుకు సరిహద్దుల్లో రేయింబవాళ్లు కష్టపడుతున్నారన్నారు. అదే విధంగా తెలంగాణ అభివృద్ధిలో బీహార్ వలస కార్మికుల పాత్ర ప్రత్యేకమన్నారు. కరోనా సమయంలో 150 రైళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా వారిని స్వస్థలాలకు పంపామని గుర్తు చేశారు. కరోనా సంక్షోభంలోనూకేంద్రం కూలీలను ఇబ్బంది పెట్టిందన్నారు. 


కేసీఆర్ ఆలోచన గొప్పదన్న  నితీష్ కుమార్  


అమరవీరులకు... మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు కేసీఆర్ అండగా ఉండాలనుకోవడం గొప్ప విషయమని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు.  గల్వాన్‌లో సైనికులు సాహసోపేతంగా పోరాడారన్నారు. వారికి కేంద్రం కూడా అండగా ఉండాల్సినఅవసరం ఉందన్నారు.  అమరులకు రాష్ట్రమే కాదు కేంద్రం కూడా అండగా ఉండాలన్నారు.  ఇతర రాష్ట్రాల్లోని సైనికులకూ ఇలాంటి సాయమే అందాలన్నారు. తెలంగాణ అభివృద్ధికో కేసీఆర్‌ది ప్రత్యేకమైన పాత్రన్నారు.  కేసీఆర్ రాష్ట్ర విభజన కోసం పోరాడితెలంగాణ సాధించారన్నారు. మిషన్ భగీరథ పథకం.. సామాన్యమైన విషయం కాదన్నారు. తెలంగాణకు ఉపాధి కోసం వెళ్తున్న కార్మికుల పట్ల కేసీఆర్ ఎంతో ఉదారత చూపిస్తున్నారన్నారు. కరోనా ముగిసిన తర్వాత కూలీలను గౌరవంగా తీసుకెళ్లారని అభినందించారు. తెలంగాణలో కేసీఆర్‌ను కాదనుకునేవారు ఎవరూ ఉండరన్నారు.  తెలంగాణ రాష్ట్ర పథకాల పరిశీలనకు తమ బృందాన్ని పంపామన్నారు.  కేసీఆర్ పథకాల స్ఫూర్తితో గంగా జలాలను ననాలుగు ప్రధాన స్థలాలకు తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తన ప్రసంగంలో కేసీఆర్‌పై ప్రశంసలకే ఎక్కువ సమయం కేటాయించారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి అద్భుతమన్నారు . కేసీఆర్ ఇలా ఎలా అభివృద్ధి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. 


రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి : తేజస్వి


 సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. బీహార్ కు కేంద్రం నుంచి రావాల్సిన సాయం రాకపోగా.. మరింత భారం పడుతోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు ఒకదానికొకటి సాయం చేసుకోవాలని తేజస్వీ అభిప్రాయపడ్డారు. సమాజంలో వ్యాప్తి చెందుతున్న ద్వేషాన్ని తగ్గించడం పెను సవాల్ గా మారిందని అన్నారు. 


ప్రత్యేకంగా భేటీ అయిన కేసీఆర్, నితీష్,  తేజస్వి


అమరవీరుల కుటుంబాలకు చెక్కేకులు పంపిణీ కార్యక్రమంలో రాజకీయాలపై ఎవరూ మాట్లాడేదు. తర్వాత    నితీష్ కుమార్, తేజస్వి యాదవ్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు.   ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల అంశంపై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.  అమరవీరులకు ప్రభుత్వం తరపున సాయం అందిస్తున్నందున... సీఎం కేసీఆర్‌ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కూడా వెళ్లారు. అలాగే  ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, జాతీయ రైతు సంఘాల నేతలు  కూడా పట్నాలో పర్యటించారు.