దళిత బంధు పథకాన్ని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కొనియాడారు. ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని, దీన్ని విజయవంతం చేసుకోవాలని కోరారు. ఈ పథకం కేసీఆర్ కచ్చితంగా అమలు చేస్తారని రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు. ఒకవేళ దళిత బంధు అమలు కాకుంటే తాను యాదగిరి గుట్ట దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని సవాలు విసిరారు. దళిత బంధు పథకానికి మద్దతుగా ఆదివారం మోత్కుపల్లి నర్సింహులు దీక్ష చేపట్టారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆయన.. ఉదయం 10 గంటల సమయంలో నివాసంలోనే దీక్ష మొదలుపెట్టారు. సాయంత్రం 5 గంటలకు వరకు ఈ దీక్ష కొనసాగనుంది.


Also Read: YSR Death Anniversary: వైఎస్ కేబినేట్ మంత్రులకు విజయమ్మ ఆహ్వానం!... పిలుపుపై రాజకీయవర్గాల్లో చర్చ


దళిత బంధు విషయంలో సీఎం కేసీఆర్‌‌ను మోత్కుపల్లి ప్రశంసలతో ముంచెత్తారు. కేసీఆర్ దళితుల ఆత్మబంధువని కొనియాడారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. తాను 30 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ఏ సీఎం కూడా కేసీఆర్‌లా దళితుల అభివృద్ధి కోసం పని చేయలేదని విమర్శించారు. దళితుల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ మాత్రమేనని చెప్పారు. ఎవరు మంచిపని చేసినా ఆహ్వానించాల్సిందేనని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తుంటే కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఎందుకు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న చరిత్ర అలాంటిది.. మాజీ ఉద్యోగుల సంచలన ఆరోపణలు


రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ.. ఆయన శనిపాదం అని మోత్కుపల్లి విమర్శించారు. తెలంగాణలో టీడీపీని సర్వనాశనం చేసిందే రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు. ఆయన జీవితం మొత్తం మోసమేనని దుయ్యబట్టారు. రూ.వందల కోట్లు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. సొంతూరిలో దళితులను రేవంత్ ఏనాడైనా గౌరవించాడా అని ప్రశ్నించారు. బండి సంజయ్‌ పాదయాత్ర ఎవరికోసం చేస్తున్నాడని మోత్కుపల్లి ప్రశ్నించారు. ఆయన పాదయాత్రతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని కొట్టిపారేశారు.


Also Read: In Pics: రాష్ట్రంలో టీఆర్ఎస్.. కేంద్రంలో బీజేపీ.. ఇంకో 20 ఏళ్లు ఇంతే.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు