Paralympics 2020: 'దేశం' నిన్ను చూసి గర్విస్తోంది.. భవీనాకు అభినందనల వెల్లువ

ABP Desam   |  29 Aug 2021 11:25 AM (IST)

పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ లో సిల్వర్ మెడల్ సాధించిన భవీనా పటేల్ కు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి, ప్రధాని సహా సోషల్ మీడియాలో ఆమెకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

భవీనా పటేల్ కు దేశం అభినందనలు

పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించిన టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భవీనాబెన్‌ పటేల్‌ ను దేశం మొత్తం అభినందిస్తోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా భవీనాకు ఫోన్ చేసి మాట్లాడారు. పారాలింపిక్స్ లో చరిత్ర సృష్టించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్న పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. 

ఎంతోమందికి ప్రేరణగా..

పారాలింపిక్స్ లో రజతం సాధించి భవీనా పటేల్ ఎంతోమంది భారత యువతకు ప్రేరణగా నిలిచారు. మీ కఠోర శ్రమ, నైపుణ్యం.. భారత్ కు ఎనలేని కీర్తి తెచ్చింది. మీకు నా హృదయపూర్వక అభినందనలు  -           రామ్ నాథ్ కోవింద్, రాష్ట్రపతి

మరిన్ని విజయాలు..

చరిత్ర సృష్టించారు..

భవీనా పటేల్ చరిత్ర సృష్టించారు. రజతం పతకం సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆమెకు నా అభినందనలు. ఆమె జీవితం ఎంతోమందికి ఆదర్శం. మరింత మంది యువత క్రీడల్లోకి రావడానికి ఆమె ప్రేరణగా నిలిచారు.                 -     నరేంద్ర మోదీ, ప్రధాని

టేబుల్ టెన్నిస్ స్వర్ణ పతక పోరులో ప్రపంచ నంబర్‌ వన్‌, చైనా క్రీడాకారిణి యింగ్‌ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలైంది. దీంతో ఆమె రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పారాలింపిక్స్‌ చరిత్రలోనే టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం.

Published at: 29 Aug 2021 11:25 AM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.