One8 Commune in Hyderabad: క్రికెటర్ విరాట్ కొహ్లీ క్రీడారంగంలోనే కాక వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. కొహ్లీ వన్ 8 బ్రాండ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆ బ్రాండ్ పుమాతో కలిశాక వారి మార్కెట్ వ్యాల్యూ విపరీతంగా పెరిగినట్లుగా వ్యాపార వర్గాలు చెబుతుంటాయి. అంతటి క్రేజ్ ఉన్న విరాట్ కొహ్లీ రెస్టారెంట్ బిజినెస్ లో కూడా అదే తరహాలో దూసుకుపోతున్నారు. విరాట్ కోహ్లీ ‘వన్ 8 కమ్యూన్’ పేరుతో రెస్టారెంట్లను వివిధ నగరాల్లో తెరుస్తున్నారు. ఇప్పటికే ఈ రెస్టారెంట్లు బెంగళూరు, ముంబయి, పుణె, కోల్‌కతా, ఢిల్లీ నగరాల్లో ఉన్నాయి. 


తాజాగా వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ హైదరాబాద్ కు చేరింది. హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో హార్డ్ రాక్ కేఫ్ దగ్గర్లో ఈ వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు. ఆర్ఎంజడ్ ది లాఫ్ట్‌ లో ఈ రెస్టారెంట్‌ శుక్రవారం (మే 24) ప్రారంభం అయింది. ఈ విషయాన్ని విరాట్ కొహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. 


వన్ 8 కమ్యూన్ హైదరాబాద్ కు వచ్చిందని ఒక పోస్టు చేశారు. ‘‘హే హైదరాబాద్, నేనొక ఆసక్తికరమైన విషయం మీతో పంచుకోవాలి. మేం ఇప్పుడే హైటెక్ సిటీకి వచ్చేశాం. ఇక మీ రెస్టారెంట్ ఎక్స్‌పీయన్స్ మరో స్థాయికి చేరనుంది. నా వరకు వన్ 8 కమ్యూన్ అనేది ఒక స్థలం కంటే ఎక్కువ. ఇది జనాల్ని ఏకం చేస్తుంది. కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అసలైన కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది హైదరాబాద్ లో ఉంది. మే 24న మేం వన్ 8 కమ్యూన్ ను ప్రారంభించబోతున్నాం’’ అని విరాట్ కొహ్లీ పోస్ట్ చేశారు.


అయితే టేబుల్స్ రిజర్వ్ చేసుకోవడం కోసం.. 9559071818, 9559081818 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయాలని కూడా కొహ్లీ సూచించారు. ఇది విరాట్ కొహ్లీ రెస్టారెంట్ కావడంతో దానిని చూసేందుకు అనేక మంది వెళ్తున్నారు. ఈ రెస్టారెంట్ లో దేశీ వంటకాలతోపాటు విదేశీ వంటకాలను కూడా వడ్డించనున్నట్లు తెలుస్తోంది.