KTR on Revanth Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం (మే 24) కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ లక్ష్యంగా ఎక్స్‌లో వరుస పోస్టులు చేశారు. వివిధ అంశాల్లో ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఘాటు విమర్శలు చేశారు. ‘‘రేవంత్ ఒక సిగ్గులేని అబద్ధాన్ని క్రియేట్ చేశారు. నా బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్ డ్రగ్ కాంట్రాక్టు ప్రభుత్వం నుంచి వచ్చిందని ప్రచారం చేశారు. ఇదే సేమ్ జోకర్ మరో ఫేక్ కథనం క్రియేట్ చేశారు. తెలంగాణ సచివాలయం కింద ఉన్న నిజాం నిధులను కాజేయడం కోసం ఆ భవనాల్ని కూల్చేస్తున్నామని ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రి ఫేక్ వీడియోని వైరల్ చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చిందంటూ ఒక ఫేక్ సర్క్యులర్ ను పోస్ట్ చేశారు. ఇలాంటి నకిలీ వార్తల్ని ప్రచారం చేసే వ్యక్తిని ఎందుకు జైల్లో పెట్టరు?’’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.






నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితి నుండి పోదాం పద సర్కారు దవాఖానకే అనే ధీమాను ఇచ్చినం! జననం నుండి మరణం దాకా, ప్రతి దశలో మన సర్కారున్నది అనే గొప్ప భరోసా తెచ్చినం. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు బస్తీ దవాఖానలు, మాతాశిశు ఆసుపత్రులు నగరం నలుమూలలా నిర్మాణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వరంగల్ నడిబొడ్డున దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖానా, జనాభా దామాషాలో మరే రాష్ట్రంలో లేనన్ని మెడికల్ సీట్లు! ఒకటా? రెండా? కేసీఆర్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం దేశ చరిత్రలోనే ఒక అరుదైన విప్లవం’’ అని తమ ప్రభుత్వ హాయాంలో తాము చేసిన పనుల్ని గుర్తు చేశారు.