Unemployed Commits Suicide In Telangana: తెలంగాణలో కొనసాగుతున్నవి నిరుద్యోగుల ఆత్మహత్యలు కాదని, రాష్ట్ర ప్రభుత్వ హత్యలేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వీటికి బాధ్యుడ్ని చేస్తూ సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ,నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తొలి సంతకం చేసి బండి సంజయ్ ప్రారంభించారు. 


లక్షా ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను తప్పిన వ్యక్తి కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో లక్షా 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ తేల్చిందని గుర్తుచేశారు. తెలంగాణలో జరుగుతున్నవి నిరుద్యోగుల ఆత్మహత్యలు కాదు.. రాష్ట్ర ప్రభుత్వ హత్యలే అంటూ మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా నిరుద్యోగుల ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు తమ పోరాటం ముమ్మరం చేయాలని భావిస్తున్నారు.






ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం అసెంబ్లీ సమావేశాల సమయంలో మిలియన్ మార్చ్ చేసి తీరుతాం. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. సీఎం కేసీఆర్ పాలనపై ఆఖరి ఉద్యమం కోసం సిద్ధం కావాలి. నోటిఫికేషన్లు ఇచ్చే వరకు నిరుద్యోగుల తరుపున బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్ అన్నారు.


కరీంనగర్‌ పట్టణంలో కమాన్‌ వద్ద నేటి తెల్లవారుజామున కారు అదుపుతప్పి రహదారి పక్కన నివాసముండే నలుగురు మహిళలను బలితీసుకున్న ఘటన బాధాకరం అన్నారు. రోడ్డు పక్కనే గుడిసెల్లో నివాసం ఉండి వృత్తిని కొనసాగించే వీరిని కారు ప్రమాదం రూపంలో బలికొనడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు.


ఉదయం వైద్య అధికారులతో ఫోన్లో మాట్లాడి గాయపడిన మిగతా క్షతగాత్రులకు, బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించేలా తక్షణ చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించాం. ఉదయం నుంచి స్థానిక బీజేపీ శ్రేణులు క్షతగాత్రులకు, బాధిత కుటుంబానికి అండగా నిలిచి తగిన సహాయ సహకారాలు చేపడుతున్నారు.


Also Read: Telangana బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎంపీ‌ అరవింద్‌కు షాక్.. అంతలోనే టీఆర్ఎస్‌లో చేరిన నేతలు


Also Read: Harish Rao: తెలంగాణలో ఆ సర్జరీలు చేయవద్దు.. శిశువుల్లో రోగ నిరోధకశక్తి తగ్గుతుంది: మంత్రి హరీష్ రావు