సంగారెడ్డి జిల్లాలో ఓ టీఆర్ఎస్ నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కలకలం రేపుతోంది. అతని తలను, మొండేన్ని వేరు చేసి దారుణంగా హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. రియల్టర్‌ కడవత్‌ రాజు అనే 32 ఏళ్ల వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈయన మృతదేహం సంగారెడ్డి జిల్లా రాయకోడ్‌ దగ్గర లభ్యమైంది. ఈ కడవత్ రాజు అనే వ్యక్తి ప్రస్తుతం టీఆర్ఎస్ ఎస్టీ విభాగం తెల్లాపూర్‌ మున్సిపల్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. వెలిమెల తండా అనే గ్రామంలో ఉంటున్నాడు. ఈ నెల 24న ఇతను అదృశ్యం అయినట్లుగా 25న బీడీఎల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 


రాజు నాయక్‌ అనుచరవర్గం, తమ్ముడు గోపాల్‌పై కన్నేసి విచారించగా ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఇంద్రకరణ్‌ గ్రామ సమీపంలో గోపాల్‌, అదే గ్రామానికి చెందిన రాంసింగ్‌ అనే వ్యక్తితో కలిసి హత్య చేసినట్లుగా పోలీసులు విచారణలో తేల్చారు. అయితే ఇంద్రకరణ్ పరిసర ప్రాంతాల్లో హత్య చేయగా.. తల భాగం రాయికోడ్‌ మండలంలోని కుకునూరు గ్రామ పరిసరాల్లో లభ్యమైంది. మొండెం పుల్కల్‌ మండలం సింగూరు ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ వద్ద నీటిలో దొరికినట్లుగా పోలీసులు తెలిపారు. ఆ రెండింటిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. Also Read: పాము కాటుకు గురైన టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు... పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు...


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వెలిమెల తండాలో రూ.10 కోట్ల విలువైన 33 గుంటల భూమి విషయంలో రాజు నాయక్‌కు, రాంసింగ్‌కు గొడవలు ఉన్నాయి. రాంసింగ్‌, రాజునాయక్‌ తమ్ముడు గోపాల్‌ ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ నెల 24న ఇంద్రకరణ్‌, క్యాసారం పరిసర ప్రాంతాల వరకు రాజు నాయక్‌తో కలిసి తమ్ముడు గోపాల్‌, రాంసింగ్‌ కారులో ప్రయాణించారు. ఈ వివరాలు సీసీటీవీ కెమెరాలో నమోదైనట్లుగా పోలీసులు గుర్తించారు. అదే సమయంలో ఫోన్‌ ట్రాకింగ్‌ ఇక్కడిదాకా పని చేసి ఆ తర్వాత ఆగిపోయింది. అదే రోజు రాం సింగ్‌, గోపాల్‌సహా వీరి అనుచరులు 8 మంది రాజు నాయక్‌తో కలిసి మద్యం తాగి మత్తులో రాజు నాయక్‌ను హత్య చేసి తల, మొండెం వేరు చేశారు. న్యాల్‌కల్‌ మండలం రాఘవాపూర్‌ గ్రామ శివారు మంజీరా బ్యాక్‌ వాటర్‌లో మొండేన్ని పడేశారు. తల భాగాన్ని రాయికోడ్‌ మండలం కుకునూర్‌ గ్రామంలో పడేశారు. 8 మందిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. Also Read: Tirumala: పాము కాటుకు గురైన టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు... పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు...