Happy Birthday KTR:
కూకట్‌పల్లి: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. నేలపై, ఆకాశంలో సైతం కేటీఆర్ కు విషెస్ చెబుతూ ఆయనపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలో కేటీఆర్ కు వినూత్న పద్ధతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీఎస్‌టీఎస్ చైర్మన్ జగన్మోహన్ రావు ఆఫీస్ లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకులను అంగరంగ వైభవంగా వినూత్న పద్ధతిలో నిర్వహించారు.
18000 నోట్ బుక్స్ తో మోజాయిక్ ఆర్ట్ ద్వారా కేటీఆర్ రూపాన్ని రీక్రియేట్ చేసి బర్త్ డే విషెష్ తెలిపారు. జగన్ ఆయన టీమ్ ఈ విధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మంత్రిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ మాట్లాడుతూ.. రామన్న జన్మదినాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 18,000 నోట్ బుక్స్ ను అవసరం ఉన్న విద్యార్థులకు పంపిణీ చేస్తామని తెలిపారు.
కేటీఆర్ బర్త్ డేను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు #GiftASmile లో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే తన తరపున 47 మంది అనాథ పిల్లలకు వృత్తి విద్యకు సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు. దివ్యాంగులకు కావాల్సిన పరికరాలు, వాహనాలు అందించి వారు ముఖాల్లో చిరునవ్వు నింపారు.
నగరంలోని రాయదుర్గం ఎన్ ఎస్ ఎల్ ఐటీ పార్కులో నిర్వహించిన రక్తదానం శిబిరంలో 1000 మంది వరకు ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో ఉదయం దాదాపు 10 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు బ్లడ్ డొనేషన్ నిర్వహించారు. ప్రతి మందిలో ఒకరు ముందుకు రాగా, మొత్తం 1000 మంది టెకీలు రక్తదానం చేస్తారని టీఎంఎఫ్‌సీ అధ్యక్షుడు సత్యనారాయణ మఠాల, డిప్యూటీ సీఆర్‌వో (ఐటీ) శ్రీనివాస్‌రావు తాండ్ర వెల్లడించారు.
కేటీఆర్ బర్త్ డే సందర్బంగా తన ఆటోలో ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు ఆటో డ్రైవర్ గంధం ఆనంద్. 51 మందికి ఐదు రూపాయల భోజనాన్ని అందించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జియాగూడ నుంచి అఫ్జల్‌గంజ్ వరకుప్రయాణికులను తన ఆటోలో ఉచితంగా తీసుకెళ్లారు. ఫిలింనగర్‌లోని అపోలో ఆసుపత్రి వద్ద జీహెచ్‌ఎంసీ 5 రూపాయల భోజన కేంద్రం వద్ద 51 మందికి భోజనం పెట్టించి కేటీఆర్ పై అభిమానం చాటుకున్నారు.