Tribal Woman Assault Case: హైదరాబాద్ ఎల్బీ నగర్ లో మహిళలపై పోలీసుల థార్డ్ డిగ్రీ ఘటనలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు నివేదికతో పాటు సంబంధిత సీసీటీవీ కెమెరా దృశ్యాలను సమర్పించాలని హోం శాఖ కార్యదర్శికి, డీజీపీకి, రాచకొండ సీపీ, ఎల్బీ నగర్ డీసీపీ, వనస్థలిపురం ఏసీపీ, ఎల్బీనగర్ సీఐలకు ఆదేశాలు ఇస్తూ నోటీసులు పంపించింది. ఈ కేసులో తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఎల్బీ నగర్ చౌరస్తాలో న్యూసెన్స్ చేస్తున్నారని ఆగస్టు 16వ తేదీన తెల్లవారుజామున ముగ్గురు మహిళలు పోలీసులు స్టేషన్ కు తరలించారు. అనంతరం వారిని తీవ్రంగా కొట్టారు. లాఠీలతో బలంగా కొట్టడంతో వారు చర్మం కందిపోయింది. ఈ విషయం కాస్త బాధితుల కుటుంబ సభ్యుల ద్వారా బయటకు వచ్చింది. మీడియాలో రావడంతో సీపీ చౌహాన్ స్పందించారు. ఈ ఘనటకు బాధ్యులను చేస్తూ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. అలాగే స్టేషన్ ఎస్ఐ ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. ఈ ఘటనపై జడ్జి సూరేపల్లి నంద తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. దీంతో హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. 


Also Read: Surgical Strike: పాకిస్థాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్! మీడియాలో కథనాలు - భారత ఆర్మీ ఏం చెప్పిందంటే?


ఆగస్టు 15వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో తాను ఇంటికి వెళ్తుండగా.. పోలీసులు వచ్చి వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని.. సెల్ ఫోన్ లాక్కొని చిత్ర హింసలకు గురి చేశారని ఆరోపించింది. బుధవారం ఉదయం తనను ఇంటికి పంపించినట్లు చెప్పింది. అయితే ఆమె చేస్తున్న ఆరోపణలు అన్నీ నిజం కాదని.. ఎల్బీ నగర్ ఇన్ స్పెక్టర్ తెలిపారు. మీర్‌ పేట నంది హిల్స్ లో బాధితురాలు నివాసం ఉంటుండగా.. ఆమెతో పాటు ఆమె బంధువులు అందరూ పోలీస్టేషన్ లో ఆందోళనకు దిగారు. ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద ముగ్గురు మహిళలు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని సమాచారం వచ్చిందని ఎల్బీ నగర్ డీసీపీ సాయి శ్రీ తెలిపారు. 16వ తేదీ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చామని.. ఐపీసీ - 209 సెక్షన్ కింది కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ చౌహాన్ ఆదేశించారు. మహిళపై దాడి ఘటనపై విచారణ చేసి నివేదిక తెప్పించుకున్న సీపీ.. ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  


ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశించారు. ఈ కేసులో పోలీసుల తీరుపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. బాధితురాళ్లను పలు పార్టీల నేతలు పరామర్శించారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్‌టీపీ చీఫ్ వై ఎస్ షర్మిల డిమాండ్ చేశారు.