Hyderabad: హైదరాబాద్‌లో మంగళవారం నుంచి పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions)విధించారు. ప్లైఓవర్ల పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ఆయా మార్గాల్లో పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. ఆఫీసుకు వెళ్లాలన్న హడావుడిలో ఆ రోడ్డులోకి వెళ్లారా...ఇక మీ పని అయిపోయినట్లే. ఉసూరుమంటూ వెనక్కి తిరిగిరావాల్సిందే. కాబట్టి ఒకసారి ఏయే మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్నయో చూసుకుని వెళ్లడం మంచింది. ఇక ఆఫీసుకు ఒక పదినిమిషాలు ముందే బయలుదేరడం అంతకన్నా మంచిది. 


హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌(Hyderabad)లో పైవంతెనల నిర్మాణ పనులు కారణంగా పలుమార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. ఐటీ కారిడార్‌ గచ్చిబౌలి(Gachibowli) సమీపంలోని ఎస్‌ఆర్‌డీపీ(SRDP) శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌-2 వద్ద పైవంతెన నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఈమార్గంలో వాహనాల రాకపోకలతో పనులకు ఆటంకం ఏర్పడుతుంది. కీలకమైన పనులు జరుగుతున్న సమయంలో వాహనాల రాకపోకలు సాగిస్తే ప్రమాదం జరిగే ఆస్కారం ఉండటంతో సైబరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) ఐదురోజులపాటు ఈమార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఈ ఐదురోజులుపాటు విరామం లేకుండా ప్లైఓవర్ పనులు 24 గంటల పాటు చేస్తున్నారు.


జెడ్‌పీహెచ్‌ఎస్‌(ZPHS) యూటర్న్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే మార్గంలో వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారిలో వెళ్లాల్సిందిగా చూసించారు. ముఖ్యంగా కొత్తగూడ-రోలింగ్‌ హిల్స్‌ మార్గంలోని గచ్చిబౌలి జంక్షన్‌ వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కాబట్టి ఐటీ (IT)సంస్థలకు వెళ్లే ఉద్యోగులు ఈ మార్గలంలోకి రయ్యిమంటూ  తమ వాహనాలను తిప్పకుండా కాస్త చూసుకుని వేరేదారిలో వెళితే మీకే ఆఫీసుకు లేటు కాకుండా ఉంటుంది.ఈ ఐదురోజులపాటు ప్రజలు సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసుుల విజ్ఞప్తి చేశారు.


Also Read: హైదరాబాదులో పోలీస్ స్టేషనులకు లంచాలు వెళ్తున్నాయి: అక్బరుద్దీన్ ఒవైసీ సంచలనం


అంబర్‌పేటలోనూ ఆంక్షలు
అంబర్‌పేట(Amberpet)లోనూ ప్లైఓవర్ నిర్మాణ పనులు కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంబర్‌పేట-గోల్నాక(Golnaka) మార్గంలో వాహనాల రాకపోకలను నియంత్రించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్లైఓవర్(Flyover) పనులు పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు వివరించారు. 6 వ నెంబర్‌ మార్గంలోని జంక్షన్ నుంచి గోల్నాక్‌ వేళ్లే మార్గంలో వాహనాలను 


సమీపంలోని జిందా తిలిస్మాత్‌ రోడ్డులోకి మళ్లిస్తున్నారు. అటు గోల్నాక నుంచి 6వ నెంబర్ జంక్షన్ వరకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండానే వాహనాలను అనుమతిస్తున్నారు. ఎన్‌సీసీ గేట్ నుంచి 6వ నెంబర్ జంక్షన్ వరకు వచ్చే ఆర్టీసీ(RTC) బస్సులను తిలక్‌నగర్ అడ్డరోడ్డులోని ఫీవర్ ఆస్పత్రి వైపు మళ్లించారు. కాబట్టి ఆయా మార్గాల్లో వెళ్లేవాహనదారులు కుదిరితే ప్రత్నామ్నాయ మార్గలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. తప్పకుండా అదే మార్గంలో వెళ్లాల్సి ఉంటే మాత్రం కొంచె ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు.


ప్లైఓవర్లు పూర్తయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి కొన్నిరోజులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చిన మేరకు నెలరోజుల్లోనే అంబర్‌పేట పైవంతెనను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా పనులు చేస్తున్నారు. అందుకే ట్రాఫిక్ మళ్లించి మరీ పనులు పూర్తి చేసేలా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రజలంతా సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలకు విజప్తి చేశారు.


Also Read: తెలంగాణలో విషాదాలు - భార్యను చంపి భర్త సూసైడ్, బావిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య