Telangana New Cabinet: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. తెలంగాణ సీఎం ఎవరు అంటూ రెండు రోజులుగా ఏర్పడిన ఉత్కంఠకు తెరదించుతూ రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించేసింది కాంగ్రెస్‌ అధికారం. అయితే.. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గ కూర్పుపై చర్చ జరుగుతోంది. రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో ఎవరెవరికి స్థానం  దక్కుతుంది... ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించబోతున్నారు. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు.. కీలక మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయి.


తెలంగాణలో కొత్త మంత్రుల లిస్ట్‌ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. సీఎం పదవికి రేవంత్‌రెడ్డితోపాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా పోటీ పట్టారు. కానీ..  రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించింది హైకమాండ్‌. సీనియర్లు కూడా న్యాయం చేస్తామని ప్రకటించింది. అయితే.. కాంగ్రెస్‌లో మంత్రి పదవులు ఆశిస్తున్న వారు చాలామందే  ఉన్నారు. కానీ.. సీనియారిటీ, సామాజికవర్గాలు, జిల్లాల వారీగా.. కొంతమందిన రేవంత్ కేబినెట్‌లోకి రాబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్‌ నేతలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. 


సీఎం రేవంత్‌రెడ్డితోపాటు 18మందితో మంత్రివర్గం కూర్పు ఉండబోతున్నట్టు సమాచారం. రేవంత్‌రెడ్డి సీఎంగా కావడంతో... డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది తేలాల్సి ఉంది. డిప్యూటీ సీఎంగా పార్టీ సీనియర్‌ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు కాంగ్రెస్ కేబినెట్‌లో  ఎవరెవరు ఉండబోతున్నారు? మంత్రి పదవులు ఎవరెవరికి దక్కనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. కులసమీకరణల లెక్కలు బట్టి.. కొందరి పేర్లు ప్రముఖంగా  వినిపిస్తున్నాయి. 


ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా మంత్రివర్గంలో రేవంత్‌రెడ్డితో 18మంది పేర్లు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగా.... భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి  ఇచ్చే అవకాశం ఉంది. ఇక... మరో సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్థిక శాఖ ఇవ్వనున్నట్టు సమాచారం. ములుగు ఎమ్మెల్యే సీతక్కకు కీలకమైన శాఖ ఇస్తారని టాక్ నడుస్తోంది.  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, మదన్‌మోహన్‌రావు, దామోదర్‌ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, జి.వివేక్‌, సుదర్శన్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌, పొన్నం ప్రభాకర్‌, ప్రేమ్‌సాగర్‌రావు, మంత్రివర్గంలో రేసులో ఉన్నారు. కులాలు జిల్లాలను బేస్ చేసుకొని జట్టు కూర్పు ఉంటుందని అంచనా వేస్తున్నారు.


అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ ఓ జాబితా మాత్రం కాంగ్రెస్ గ్రూపుల్లో తిరుగుతోంది. అదే ఆయా నాయకుల అభిమానులు కూడా సోషల్ మీడియాలో షేర్‌లు చేస్తున్నారు. ఆ లిస్టు కూడా అంత నమ్మశక్యంగా కూడా లేదు. 


సోషల్‌ మీడియాలో తిరుగుతున్న లిస్ట్‌


1. రేవంత్‌రెడ్డి-ముఖ్యమంత్రి 
2. మల్లు భట్టి విక్రమార్క- ఉపముఖ్యమంత్రి
3. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి-ఆర్థిక శాఖ 
4. సీతక్క-హోంమంత్రిత్వ శాఖ
5. షబ్బీర్‌ అలీ- విద్యుత్‌ శాఖ
6. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-మున్సిపల్ శాఖ
7. మదన్‌మోహన్‌రావు- ఐటీ శాఖ మంత్రి 
8. శ్రీధర్‌బాబు- విద్య, వైద్య, ఆరోగ్య శాఖ
9. తుమ్మల నాగేశ్వరరావు- రోడ్లు భవనాల శాఖ
10. పొంగులేటి శ్రీనివాసరెడ్డి- జలవనరుల శాఖ
11. కొండా సురేఖ- మహిళా, శిశు సంక్షేమ శాఖ
12. దామోదర్‌ రాజనర్సింహ- పంచాయతీరాజ్‌
13. జూపల్లి కృష్ణారావు- పశు సంవర్థక శాఖ
14. జి.వివేక్-‌ ఎస్సీ సంక్షేమ శాఖ
15. సుదర్శన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ 
16. అద్దంకి దయాకర్- కార్మిక మంత్రిత్వ శాఖ
17. పొన్నం ప్రభాకర్‌- ఎక్సైజ్‌, బీసీ సంక్షేమ శాఖ
18. ప్రేమ్‌సాగర్‌రావు- గ్రామీణాభివృద్ధి శాఖ