తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల కార్మికులను పై స్థాయిలో నిలబెట్టాలని అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని మన్నెగూడలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం 2023 వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేనేత కార్మికుల బాధలు ఎలా ఉంటాయనేది ముఖ్యమంత్రికి తెలుసని ఆయన అన్నారు.
సీఎం కేసీఆర్ కూడా పద్మశాలి కుటుంబంలో ఉండే చదువుకున్నారని..వారి సమస్యలన్ని కూడా ఆయనకు చిన్నతనం నుంచే తెలుసని ఆయన పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ఈ సందర్భంగా ఆయన ఓ గుడ్ న్యూస్ చెప్పారు. '' చేనేత మిత్ర పథకంలో రాబోయే నెల నుంచి ప్రతి మగ్గానికి నెలకు 3 వేల చొప్పున ప్రతి కార్మికుడికి అందజేస్తామని తెలియజేశారు.
రైతులకు రైతు బీమా చేయించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. 59 ఎళ్ల పైబడిన వారికి ప్రభుత్వమే బీమా ఇస్తుంది. ఇప్పటి వరకు రూ.40.50 కోట్లు ప్రైమ్ మగ్గాలు ఏర్పాటు కోసం అందిస్తామని ఆయన వివరించారు. ఒక్కొక్క మగ్గానికి 38 వేల రూపాయలు చొప్పున అందజేస్తున్నామని తెలియజేశారు. చేనేత కార్మికులకు ఐడీ కార్డులు ఇస్తున్నాం. టెస్కో ద్వారా వీవర్స్ మెంబర్స్ కు ఎక్స్ గ్రేషియా 25 వేలకు పెంచాం. నేత కార్మికుల కోసం గృహాలక్ష్మి తీసుకోస్తామని ఆయన వివరించారు. పని కోసం సూరత్ వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో పనులు ఇచ్చే వారిగా తిరిగి వచ్చారని ఆయన పేర్కొన్నారు.
చేనేతపైన ప్రధాని మోడీ ఐదు శాతం జీఎస్టీ వేశారు. చేనేత వద్దు.. పథకాలు అన్ని రద్దు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం తీరు ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి అందులోని నాయకులకు నేత తెలియదు. నేతన్నల కష్టాలు తెలియదు. ఉప్పల్ బాగాయత్‌లో హ్యాండ్లుమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.. ఇప్పటికే శంకుస్థాపన చేశాం.. పోచంపల్లి హ్యాండ్లుమ్ పార్క్ రూ.12.60 కోట్లతో పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు.
రానున్న రోజుల్లో కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. అందులో మన ప్రభుత్వం ఉంటుంది. ప్రస్తుతం కేంద్రం రద్దు చేసిన కార్యక్రమాల్ని కూడా తీసుకువస్తాం. మీరందరూ కూడా పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండండి." అని కేటీఆర్ కోరారు.