Social Media Accounts Hack : మారుతున్న టెక్నాలజీతో సమాచార రంగంలో విప్లవాత్మకంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ట్విటర్ (Twitter), వాట్సాప్ (Whats App), ఫేస్ బుక్ (Face Book), ఇన్ స్టా గ్రామ్ (Instagram) లాంటి సామాజిక మాధ్యమాలు ( Social Media Accounts ) జనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరు ఒకటికి మించి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను సైబర్ నేరగాళ్లు వరుసగా హ్యాక్ చేస్తున్నారు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో రాజకీయ, సినీ ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయ నేతల సోషల్ మీడియా ఖాతాల వరుసగా హ్యాక్ అవుతున్నాయి. ఈ జాబితాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా చేరారు. తన సోషల్ మీడియా ఖాతాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎక్స్ సహా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డీసీపీ, సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ట్యాగ్ చేస్తూ కవిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్లు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోగి చొరబడి...సంబంధం లేని వీడియోను పోస్టు చేసినట్టు వెల్లడించారు.
మొన్న మంత్రి...నిన్న గవర్నర్
ఇటీవలే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోషల్ మీడియా ఖాతాలు హ్యాంకింగ్ కు గురయ్యాయి. మంత్రి రాజనర్సింహా సోషల్ మీడియా అకౌంట్ ను...సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంత్రికి సంబంధం లేని బీజేపీ, టీడీపీ, తమిళనాడుకు చెందిన పలు రాజకీయ పార్టీల ఫొటోలను పోస్టు చేయడం దుమారం రేపింది.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్...సోషల్ మీడియా ఖతాలను హ్యాక్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసి పాస్‌వర్డ్ మార్చేశారు. కంపెనీ నియమ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎక్స్ కంపెనీ నుంచి గవర్నర్‌కు ఓ మెయిల్ వచ్చినట్లు సమచారం. గవర్నర్ తన అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. పాస్‌వర్డ్ తప్పంటూ జవాబు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తమిళిసైకి సంబంధంలేని పోస్టులు పెట్టారు. గవర్నర్ తమిళిసై ఆదేశాలతో రాజ్‌భవన్ అధికారులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఎక్స్ అకౌంట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతంలో ప్రధాని మోడీ ఖాతా హ్యాక్
గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విటర్ ఖాతాను దుండగులు హ్యాక్ చేసినట్లు గుర్తించారు. కేంద్ర మంత్రుల ఖాతాలు, వివిధ ప్రభుత్వ ఖాతాలు, మంత్రుల ఖాతాలు హ్యాక్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిల్లలు, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాక్ చేశారు. వారికి సంబంధం లేకుండా పోస్టులను...సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తున్నారు. ఆ తర్వాత బాధితులంతా తమ ఖాతా హ్యాక్ అయిందంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. గతంలో విదేశాంగ శాఖలోని విదేశీ వ్యవహారాల విభాగం ట్విటర్ ఖాతాను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలను హ్యాకర్లు పట్టుకుంటున్నట్లు సమాచారం.