Wings India 2024 Hyderabad Aviation Show: నేటి నుంచి హైదరాబాద్‌లో ఏవియేషన్ షో ప్రారంభంకానుంది. 21 వరకు జరిగే ఈ షోలో 25 వరకు విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శించనున్నారు. వింగ్స్‌ ఇండియా 2024 పేరుతో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌లో తొలిసారిగా బోయింగ్‌తోపాటు ఎయిర్‌ ఇండియా మొదటి హెలికాప్టర్‌ ఏ 350ను ప్రదర్శించనున్నారు. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ వేదికగా ఈ షో ఆకట్టుకోనుంది. 


వింగ్స్‌ ఇండియా 2024 ఏవియేషన్ షోను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభిస్తారు. ఇందులో ప్రపంచ దేశాల నుంచి 130 ఎగ్జిబిటర్స్‌, 15 హాస్పిటరాలిటీ చాలెట్స్, వందకుపైగా దేశాల నుంచి డెలిగేట్స్, ఐదు వేల వరకు బిజినెస్‌ విజిటర్స్‌ ఈ షోలో పాల్గోనున్నారు. ఇక్కడ అగస్తా వెస్ట్‌ ల్యాండ్‌, బెల్ హెలికాప్టర్స్, రష్యన్ హెలికాప్టర్‌, ఎయిర్‌బస్‌ హెలికాప్టర్స్ ప్రదర్సనకు ఉంచుతారు. సీఎఫ్‌ఎం, యూటీసీ, ఈజీ ఏవియేషన్, రోల్స్ రాయిస్, ప్రట్‌ అండ్ వైట్నీల ప్రోడెక్ట్స్‌ను ఉంచబోతున్నారు. 




వింగ్స్‌ ఇండియా 2024 షోల ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు ఐదు గేట్లను ఏర్పాటు చేశారు. చాలెట్‌ ఎగ్జిబిటర్లకు, వీఐపీలు, ఇతర ముఖ్య అతిథులను గేట్‌ 1 నుంచి ప్రవేశ కల్పిస్తారు. గేట్‌ 2లో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే డెలిగేట్స్‌, సీఈవో రౌండ్‌ టేబుల్‌కు హాజరయ్యే వారిని మాత్రమే ఎలో చేస్తారు. నిర్వహకులు, చాలెట్‌ ఎగ్జిబిటర్లు, ప్రభుత్వ ప్రతినిధులను మూడో గెట్‌ నుంచి పంపిస్తారు. నిర్వాహకులు, ఎగ్జిబిటర్లు, మీడియా, బిజినెస్‌ విజిటర్స్‌కు గేట్‌ నాలుగు నుంచి లోనికి పంపిస్తారు. ఎయిర్‌పోర్ట్ ఎంప్లాయీస్‌, ఎగ్జిబిటర్స్, వింగ్స్‌ ఇండియా విధులు నిర్వర్తించే వారి కోసం ఐదు గేటు రెడీ చేశారు. మీడియా, సామాన్య ప్రజలు ఎగ్జిట్ గేటు ద్వారా బయటకు రావాల్సి ఉంటుంది.