Betting App Cases:తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీ సెలబ్రెటీలు ఇప్పుడు కేసుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న 11 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు మరో 25 మందిపై కేసులు రిజిస్టర్ చేశారు. వీరిలో చాలా మంది అగ్రనటులు ఉన్నారు.
కేసులు నమోదు అయిన వారి వివరాలు ఇవే
రానా దగ్గుబాటి
విజయ్ దేవరకొండ
ప్రకాశ్‌రాజ్,
మంచులక్ష్మియ
నిధి అగర్వాల్
యాంకర్ శ్రీముఖి
వర్షిణి
సిరి హన్మంతు
అనన్య నాగళ్ల
వాసంతి కృష్ణన్
శోభాశెట్టి
అమృతా చౌదరి
నయనీ పావని
నేహా పఠాన్
పండు
పద్మావతి
ఇమ్రాన్ ఖాన్
విష్ణు ప్రియ
హర్ష సాయి
బయ్యా సన్నీ యదవ్
శ్యామల
టేస్టీ తేజ
రీతుచౌదరి
బండారు శేషాయని సుప్రీత
ఇలా 25 మందిని గుర్తించి పోలీసులు కేసులు పెట్టారు. వీళ్లను విచారణకు రావాల్సిందిగా మియాపూర్ పోలీసులు పిలుస్తున్నారు. మొన్నటి వరకు డ్రగ్స్ ఉదంతం సినిమా పరిశ్రమను ఊపేసింది. అది కాస్త చల్లబడింది అనేసరికి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంశం సంచలనం సృష్టిస్తోంది. ఈ మద్య 11 మంది సెలబ్రెటీలకు నోటీసులు ఇచ్చిన పంజాగుట్ట పోలీసులు వారిని పిలిచి విచారిస్తున్నారు. వాళ్ల నుంచి దీనికి సంబంధించిన వివరాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర సమాచారన్ని తీసుకుంటున్నారు.
పెట్టిన కేసులు వివరాలు ఇవే
ఈ 11 మందిపై కేసులు నమోదు చేయడంతో సోషల్ మీడియా యాక్టివ్ అయ్యింది. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారందరిపై పోలీసులు ఫిర్యాదులు వెల్లువత్తుతున్నాయి. అందరిపైనే కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అందర్నీ పిలిచి విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సెక్షన్ 318(4)112, రెడ్ విత్.. బీఎన్‌ఎస్ 3, 3(A) 4, ఐటీ పరిరక్ష చట్టం 660 ప్రకారం వీళ్లందరిపై మియాపూర్ పోలీసులు కేసులు రిజిస్టర్ చేశారు.
మరోసారి నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు
మరోవైపు ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందిస్తున్న సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా వచ్చి విచారణకు హాజరవుతున్నారు. గురవారం కూడా పలువురు సినీ, సోషల్ మీడియా సెలబ్రెటీలు వచ్చి సమాధానాలు చెబుతున్నారు. ఇంకా విచారణకు హాజరుకాని మరో ఆరుగురికి మరోసారి నోటీసులు ఇచ్చారు. నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీకి నోటీసులు జారీ చేశారు. ఈ కేసుల బెదతతో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్‌తో పాటు హర్ష సాయి దుబాయ్‌కి పరారీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విచారణకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ విచారణకు హాజరయ్యారు.
నష్టపోయిన బాధితులు కేసులు పెట్టాలని పోలీసులు పిలుపు
బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది యువత నష్టపోతున్నారు. ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఇలా వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీనిపై నిత్యం పోలీసులకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. దీన్ని కట్టడి చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే వాళలపై కేసులు పెడుతున్నారు. అంతే కాకుండా ఇలాంటి ప్రమోషన్స్‌తో నష్టోపోయిన వాళ్లు ఎవరైనా ఉంటే కేసులు పెట్టాలని కూడా చెబుతున్నారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ యాప్స్‌లో హవాళా మనీ కూడా ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. పూర్తి వివరాలు తెలంగాణ పోలీసుల నుంచి వివరాలు సేకరించింది.