ఛాన్స్ దొరికితే చాలు కేంద్రం, బీజేపీపై సెటైర్లతో విరుచుకుపడుతున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ... పౌష్టికాహార లోపంపై మాట్లాడుతూ... భోజనం అనడానికి బదులు భజన అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ టెలిప్రాంప్టర్‌లో తప్పు ఉందని ఎద్దేవా చేశారు. ఇలాంటి టైంలో పౌష్టికాహారం లోపంపై దృష్టిపెట్టాలని సూచించారు.
అదే టైంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ట్వీట్‌కు కూడా కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ స్పందించారు. గౌతమ్ అదానీ సంపదన పెరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ భారత్ అభివృద్ధి చెందడం లేదని ఎవరు అంటారని అని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నించారు
నాగేశ్వర్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్... పొరపాటున ఆ ఒక్క అకౌంట్లోనే మొత్తం డబ్బులు పడ్డాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి పేద భారతీయుడికి వాగ్దానం చేసిన 15 లక్షల రూపాయలు మొత్తాన్ని ఆ ఖాతాలోనే పడ్డాయోమో... పొరపాటున తప్పు జరిగిందా మోదీజీ అని ట్వీట్ చేశారు.
కర్ణాటకలో ప్రతి మంత్రి పర్సంటేజ్ తీసుకుంటుంటే ఈడీ, సీబీఐ ఎక్కడా అంటూ మరో ట్వీట్ చేశారు.
కర్ణాటకలో కాంట్రాక్టర్సే ఈ ఆరోపణలు చేస్తున్నారని... వివిధ మీడియా కథనాలు జత చేశారు కేటీఆర్