Telangana High Court regect to give stay on SIT Notice to BL Santhosh: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి షాకిచ్చింది తెలంగాణ హైకోర్టు. జాతీయ ప్రధాన కార్యదర్శి బిల్ సంతోష్ కు సిట్ నోటీసులపై స్టే విధించాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించగా.. సిట్ నోటీసులను రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఫామ్ హౌస్ కేసులో బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులపై బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయడానికి వీలు లేదని హైకోర్టు సూచించింది. సిట్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను సైతం హైకోర్టు విచారించింది. ఢిల్లీలో ఓ వ్యక్తికి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని హైకోర్టుకు తెలపగా.. కేసు దర్యాప్తునకు అంతరాయం కలిగించవద్దని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను ఆదేశించాలని సిట్ కోరింది. తదుపరి విచారణను మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.


బిఎల్ సంతోష్, శ్రీనివాస్ లకు 41 (ఏ)Crpc నోటీసులు ఇవ్వడం మీడియాకు ఎలా లీక్ అవుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. ఇక్కడి సిట్ పోలీసులు ఢిల్లీకి నోటీసులు ఇవ్వడానికి వెళ్లగా స్థానిక ఎన్నికలు ఉన్నందున నోటీసులు ఇచ్చేందుకు అక్కడి పోలీసులు నిరాకరించారని లాయర్ తెలిపారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు బిఎల్ సంతోష్ కు నోటీసులు సర్వ్ చేస్తారని హైకోర్టు చెప్పింది. ఢిల్లీ పోలీసులకు 41 (ఏ) నోటీసులు సిట్ అధికారులు ఇచ్చిన తరువాత బీజేపీ నేతకు విచారణకు సంబంధించి సిట్ నోలీసులను పోలీసులు ఇస్తారని నేటి విచారణలో వెల్లడించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి అరెస్ట్ చెయ్యడానికి వీల్లేదని స్పష్టం చేసిన హైకోర్టు.. సిట్ దర్యాప్తుపకు సహకరించాలని బీఎల్ సంతోష్ ను ఆదేశించింది.


ఫామ్ హౌస్ కేసులో సిట్‌ దూకుడు తెలంగాణలో రాజకీయంగా కాక రేపుతోంది. పలువురు ప్రజాప్రతినిధులు, బీజేపీ సానుభూతిపరులకు నోటీసులు ఇవ్వడం దుమారం రేగుతోంది. అలెర్ట్‌ అయిన బీజేపీ విషయాన్ని కోర్టులో తేల్చోవాలని చూస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దూకుడు పెంచింది. కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉందని అనుమానిస్తున్న వారిని పిలిచి విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన వారు ఇచ్చిన సమాచారం. వీడియోలో ప్రస్తావనకు వచ్చిన వారికి నోటీసులు జారీ చేసింది. 


బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు.. 
ప్రజాప్రతినిధులు, ఇతరులకు 41(A) CRPC కింద నోటీసులు జారీ చేసింది సిట్. ఈ నెల 21 న కమాండ్ కంట్రోల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరుకావాలని సూచించింది. సిట్ విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని నోటీసులో పేర్కొంది సిట్. వరుసగా బీజేపీ కీలక నేతలు, సానుభూతిపరులకు రావడంతో బీజేపపీ అలెర్ట్ అయింది. దీనిపై హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేసింది. బీజేపీ లీడర్ గుజ్జెల ప్రేమేందర్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. సిట్‌ నోటీసులపై స్టే ఇవ్వాలని అందులో అభ్యర్థించారు. ఇలా వీడియోలో ప్రస్తావన వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిల్ సంతోష్, కేరళ ఎన్డీఏ కన్వీనర్ తుషార్, అమృత ఇన్స్ట్యూట్ మెడికల్ సైన్స్‌లో ఉద్యోగి జగ్గుస్వామి, బండి సంజయ్ అనుచరుడు న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21 న సిట్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.