తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌‌కు మాతృ వియోగం కలిగింది. ఆమె తల్లి కృష్ణ కుమారి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 77 ఏళ్లు. ఇటీవల కృష్ణ కుమారి అస్వస్థతకు గురి కాగా.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కొద్ది రోజులుగా ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ఆమె చనిపోయారు. దీంతో గవర్నర్ తమిళిసై కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. కృష్ణ కుమారి భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి రాజ్ భన్‌కు తరలించనున్నారు. అక్కడ కాసేపు ఉంచి హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలించనున్నారు. చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ ఎంపీ కుమారి నందన్‌ భార్య అయిన కృష్ణకుమారి పెద్ద కుమార్తె గవర్నర్‌ తమిళిసై.


కేసీఆర్ సంతాపం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణ కుమారి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు గవర్నర్ తల్లి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న గవర్నర్ కుటుంబానికి హరీశ్ రావు సానుభూతి వ్యక్తం చేశారు. కృష్ణ కుమారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.






Also Read: Weather Updates: ఈ జిల్లాలకు అలర్ట్.. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీలో ఈ ప్రాంతాల్లో కుంభవృష్టి


ఏపీ గవర్నర్ సంతాపం


తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణ కుమారి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని ఏపీ గవర్నర్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.






బండి సంజయ్ ప్రగాఢ సానుభూతి
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణ కుమారి మరణం పట్ల బీజేపీ అధ్యక్షుడు  బండి సంజయ్ కుమార్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గవర్నర్ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. కృష్ణకుమారి ఆత్మకు శాంతి చేకూరాలని బండి సంజయ్ ప్రార్థించారు.


Also Read: Mancherial: అఫ్గానిస్థాన్‌లో తెలుగువాళ్లు.. చిక్కుకుపోయిన మంచిర్యాల వాసి, ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఫ్యామిలీ






Also Read: MP Bandi Sanjay: కామన్ మ్యాన్ లా గుడారాల్లో బండి సంజయ్.. కనీసం టీవీ కూడా లేదట