హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళనకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం విదేశాలకు వెళ్లి నదులను పరిశీలిస్తోంది. కొన్ని నెలల కిందట యూరప్ వెళ్లిన తెలంగాణ మంత్రులు, అధికారుల టీమ్ లండన్ లో థేమ్స్ నదిని పరిశీలించింది. తాజాగా తెలంగాణ శాసన బృందం సౌత్ కొరియా పర్యటనలో భాగంగా శుక్రవారం (నవంబర్ 15న) రాజధాని సియోల్ నగరంలోని హన్, చియాంగీచాన్ నదలను సందర్శించింది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, లెజిస్లేచర్ సెక్రటరీ డా. నరసింహాచార్యులతో కూడిన రాష్ట్ర బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. రాజధాని సియోల్ నగరం మధ్యలో నుంచి ప్రవహించే హన్ నది గతంలో మురికి కూపంగా, కాలుష్యంతో కూడుకుని ఉండేదని గుర్తించారు. అయితే సౌత్ కొరియా ప్రభుత్వం దాదాపు 20 సంవత్సరాల కిందట హన్ నదిని శుద్ధి చేసింది. నది పరిసరాలను సైతం సుందరీకరణ చేసి, మౌళిక వసతులు కల్పించి మంచి పర్యాటక ప్రదేశంగా మార్చిందని స్థానిక అధికారులు పర్యటనకు వచ్చిన తెలంగాణ శాసన బృందానికి వివరించారు. చియాంగీచాన్ నదీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం మౌళిక వసతులు ఏర్పాటు చేసిన తరువాత పర్యాటకం బాగా అభివృద్ధి చెందినట్లు వ్యాపారులు, స్థానికులు తెలంగాణ శాసన బృందానికి తెలిపారు.
మూసీ నదిలాగే హాన్ నది
హైదరాబాద్ లోని మూసి నదికి, సియోల్ లోని హాన్ నది పరిస్థితులు ఒకే తీరుగా ఉన్నాయని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్న మూసి పునరుజ్జీవనం, సుందరీకరణ (Musi Beautification) పూర్తయితే మూసీ కూడా పరిశుభ్రంగా మారతుంది. హైదరాబాద్ నగరానికి మరో మంచి పర్యాటక ప్రదేశంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) కాన్ఫరెన్స్ లో తెలంగాన నేతలు పాల్గొన్నారు. అనంతరం కామన్వెల్త్ దేశాలలో స్టడీ టూర్ లలో భాగంగా ఇదివరకే జపాన్, న్యూజిలాండ్ లో పర్యటించిన తెలంగాణ శాసన బృందం దక్షిణ కొరియా చేరుకుంది.
Also Read: Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!