తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్(CM KCR) మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. నేరుగా పంచాయతీలకు నిధులు ఇవ్వడంపై మండిపడ్డారు. ఇదంతా చిల్లరవ్యవహారంగా అభివర్ణించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ కేంద్రం తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
ఈ నెల 20 నుంచి తెలంగాణ ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టనుంది. దీనిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు, మేయర్లు, సీఎస్ సోమేశ్ కుమార్, ఆయా శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: తెలంగాణ వ్యక్తుల్ని రాజ్యసభ పదవుల నుంచి తొలగించండి - సీఎం జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన సెగ
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఈ సందర్భంగా నిధుల అంశం చర్చకు వచ్చింది. అప్పుడే కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత పంచాయతీలపై కేంద్రం పెత్తనం చెలాయించలేదని గుర్తు చేశారు కేసీఆర్. ప్రస్తుతం పాలిస్తున్న కేంద్రం ప్రభుత్వం పల్లెలపై పెత్తనం సాధించేందుకు ప్రయత్నిస్తోందని.. నేరుగా కేంద్ర పథకాల నిధులు ఇస్తామనడం చిల్లర వ్యవహారంగా అభివర్ణించారు. జవహర్ రోజ్‌గార్ యోజన, ప్రధాని గ్రామసడక్ యోజన, నరేంగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా నేరుగా కేంద్రమే ఇవ్వడమంటేని ప్రశ్నించారు కేసీఆర్.
Also Read: మరో శ్రీలంకలా తెలంగాణ, రాజపక్స పరిస్థితే కేసీఆర్ కు వస్తుంది : రేవంత్ రెడ్డి
రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు స్థానిక ప్రభుత్వాలకే తెలుస్తాయని ఆ నిధులు ఆ మేరకు ఖర్చు పెడతారని వాటిని వదిలేసి నేరుగా కేంద్రమే నిధులు ఇస్తామని చెప్పడం మంచి పద్దతి కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్ధాలు అవుతున్న చాల ా పల్లె, పట్టణ ప్రాంతాలు ఇంకా చీకట్లో మగ్గుతున్నాయన్నారు కేసీఆర్. చాలా పల్లెల్లో ఇప్పటికీ కరెంటు, తాగు నీరు లేదని ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టడం మానేసి రాష్ట్ర ప్రభుత్వ నిధులపై జోక్యం చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇలాంటి సంకుచిత మనస్తత్వాన్ని సరిచేసుకోవాలని కేసీఆర్ సూచించారు.
Also Read : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం, ఐసీయూలో చికిత్స
రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ.. ఆర్థికంగా దెబ్బతీసే కేంద్రం విధానాలు ఉన్నాయని గతంలో కూడా ఆరోపించారు కేసీఆర్. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అన్న రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.