YSRCP Rajya Sabha Members: ఎంపీ వి.విజయసాయిరెడ్డితో పాటు ఆర్‌.కృష్ణయ్య, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, బీదా మస్తాన్‌రావులను వైఎస్సార్‌సీపీ తమ రాజ్యసభ సభ్యులుగా మంగళవారం ప్రకటించింది. అయితే ఏపీ వారిని కాదని, తెలంగాణ వ్యక్తులకు పదవులు ఇవ్వడంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, న్యాయవాది నిరంజన్ రెడ్డిలు తెలంగాణకు చెందిన వారని, వారికి కేటాయించిన రాజ్యసభ పదవుల నుంచి తక్షణమే తొలగించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు.

Continues below advertisement

2024 ఎన్నికల్లో జగన్‌కు కష్టమే.. ఆ ఇద్దరికి కేటాయించిన రాజ్యసభ పదవుల నుంచి తొలగించకపోతే 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు, రుద్యోగులు, ప్రజలు సీఎం జగన్‌కు దూరం అవుతారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్, ఎస్సీ ఎస్టీ నాయకులు అక్క బత్తుల గిరీష్ బీసీ నాయకులు ఉమ్మడి మహేష్ సంతోష్ చిన్ని  సీతంపేట వేదికగా తెలియజేశారు. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు తెలంగాణ రాష్ట్ర సాధణ పోరాటంలో ఆంధ్రులకు వ్యతిరేకంగా  కీలక పాత్ర పోషించారని, 2024 వరకు తమకు హైదరాబాద్‌లో ఉమ్మడి రాజధానిగా సమాన హక్కు ఉన్నప్పటికీ, ఎన్నడూ ఏపీ నిరుద్యోగులను హైదరాబాద్ ఉద్యోగాలలో స్థానికులుగా పరిగణించాలని ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు.

ఆంధ్ర ద్రోహులకు రాజ్యసభ పదవులా ? అలాంటి ఆంధ్ర ద్రోహులకు రాష్ట్రం నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు రాజ్యసభకు వారిని పంపడం అన్యాయం అన్నారు. ఏపీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, సీఎం వైఎస్ జగన్‌ను, రాష్ట్రాని అభిమానించే ఎంతోమంది కార్యకర్తలు, అభిమానులు ఉండగా, 175 బీసీ కులాలకు చెందిన లక్షలాది మంది నేతల్ని కాదని తెలంగాణకు చెందిన వ్యక్తులకు రాజ్యసభ పదవులు ఇవ్వడం తమ మనోభావాలు దెబ్బతీయడమేనన్నారు. నిరుద్యోగ పోరాటాలు చేసిన ఉద్యమకారులు ఏపీలో ఉండగా, వారందర్నీ కాదని ఆర్.కృష్ణయ్య ,నిరంజన్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ నేతలకు రాజ్యసభ పదవులను కేటాయించే వరకు నిరసన దీక్షలు కొనసాగిస్తామని ఏపీ నిరుద్యోగ జేఏసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు స్పష్టం చేశారు.  

Continues below advertisement

Also Read: R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

Also Read: Lucky Krishnayya : ఏ పార్టీ అయినా పిలిచి మరీ అవకాశాలు - అదృష్టమంటే ఆర్.కృష్ణయ్యదే !