Vanajeevi Ramaiah : పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిగూడెం సమీపంలో బుధవారం ఉదయం మొక్కలు నీళ్లు పోసేందుకు రోడ్డు దాటి వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. గాయాల పాలైన రామయ్యను  గ్రామస్తులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామయ్య కుడికాలుకు, తలకు గాయం  అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. రామయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 


గతంలోనూ ఓ రోడ్డు ప్రమాదం 


ఖమ్మం రూరల్‌ మండలంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు రోడ్డు దాటుతుండగా వనజీవి రామయ్యను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామయ్యకు కాలు, చేతి, తలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే రామయ్యను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. రామయ్యకు ఇటీవల కాలంలో జరిగిన రెండో రోడ్డు ప్రమాదం ఇది. ఇటీవల ప్రమాదంలో కాలికి గాయమైందని వైద్యులు తెలిపారు. సర్జరీ చేయాలని కూడా సూచించారు. ఈ తరుణంలో మళ్లీ ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో రామయ్య గాయపడ్డారు. 2019 మార్చిలోజరిగిన రోడ్డు ప్రమాదంలో వనజీవి రామయ్య గాయపడ్డారు. మార్చి 30న తన మనమరాలిని చూసి బైక్ పై వెళ్తోన్న రామయ్యను మున్సిపల్ కార్యాలయం వద్ద ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. 


"రోడ్డు క్రాస్ చేస్తుంటే బైక్ ఢీకొట్టింది. కింద పడడంతో కుడి కాలుకి గాయమైంది. అలాగే తలకు కూడా గాయమైంది. ఎక్స్ రే తీస్తున్నాం. ప్రస్తుతం ఐసీయూలో ఉంచాము. సీటీ స్కాన్ కూడా చేస్తున్నాం. ప్రస్తుతం రామయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. " అని వైద్యులు తెలిపారు. 


"చాలా స్పీడుగా వస్తారు. అక్కడ స్పీడ్ బ్రేకర్లు లేవు. స్పీడ్ బ్రేకర్లు పెడితే ఈ ప్రమాదం జరిగేది కాదు. నిన్న విత్తనాలు జల్లిన. 20 కేజీలు విత్తనాలు జల్లిన. ఎర్ర చందనం విత్తులు జల్లి అవి కూడా జల్లిన. బైపాస్ రోడ్డులో గేదెలు ఇరికించుకుని పాడుచేస్తున్నాయి. చెట్లను బర్రెలు విరిచేస్తున్నాయి. అందుకే గ్రానైట్ రాళ్లు పెడుతున్నాను. అలా పెట్టేందుకు పొద్దుగాలే వెళ్తున్న స్పీడు వచ్చాడు. గుద్దినాడు , ఆ పిల్లగాడికి ఎట్లుందో. మా ఇంటి కాడ స్పీడ్ బ్రేకర్లు పెట్టాలి." అని వనజీవి రామయ్య అన్నారు. 


Also Read : MLC Kavita On Congress : కాంగ్రెస్ ఓ తోక పార్టీ, ప్రాంతీయ పార్టీలదే అధికారం- ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు