ఇప్పటికే జాతీయ రాజకీయలపై పోకస్ పెట్టిన సీఎం కేసీఆర్‌ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇన్నిరోజులు రాజకీయ పార్టీలతో చర్చించిన కేసీఆర్‌ ఈసారి రైతులతో మీటింగ్‌లు పెడుతున్నారు. ఇవాళ ప్రగతి భవన్‌లో 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలతో సమావేశంకానున్నారు. 


ప్రగతి భవన్‌లో 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతల సమావేశాలకు హాజరయ్యారు. అల్పాహార కార్యక్రమం తర్వాత వ్యవసాయ, సాగునీటి రంగం తదితర తెలంగాణ ప్రగతిపై రైతులకు వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, రైతుల ప్రగతికి దోహదపడేందుకు తీసుకొచ్చిన పథకాలను వారికి వివరించింది కేసీఆర్ టీం. వీటన్నింటిపై రూపొందించిన డాక్యుమెంటరీ ద్వారా వాళ్లకు తెలియజేశారు.  


గౌరారం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు దేశవ్యాప్తంగా వచ్చిన రైతు సంఘం ప్రతినిధులు. మల్లన్న సాగర్ టాంక్ బండ్‌ను, పంప్ హౌస్‌ను, తదితర నిర్మాణాలను పరిశీలించారు నేతలు. 


ఈ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన రైతు సదస్సు నిర్వహించారు. దేశంలో నెలకొన్న వ్యసాయ రంగం  పరిస్థితులతోపాటు...తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం సాగునీరు విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర వ్యవసాయ అనుబంధ రంగాల పురోగతిపై చర్చించారు. 


మధ్యాహ్నం లంచ్, జాతీయ రైతు సంఘాల నేతలతో కలిసి భోజన కార్యక్రమంలో పాల్గొంటారు. లంచ్ అనంతరం తిరిగి కొనసాగనుందీ సదస్సు.