సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల టౌన్‌షిప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 145 ఎకరాల విస్తీర్ణంలో ఈ టౌన్‌షిప్‌ను నిర్మించారు. ఇక్కడ ప్రభుత్వం 15,660 ఇళ్లను నిర్మించి పేదలకు ఇచ్చింది.
ఇది ఆసియాలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి పెద్ద టౌన్‌షిప్‌గా తెలంగాణ సర్కారు చెబుతోంది. దీనికి కేసీఆర్ నగర్ టీబీకే డిగ్నిటీ హౌసింగ్ కాలనీగా నామకరణం చేశారు. ప్రత్యేక వాహనంలో ఆ టౌన్‌షిప్‌లో ఇళ్లను సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు పరిశీలించారు.
560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ టౌన్‌షిప్‌లో ఇళ్లు నిర్మించారు. ఇందులో దాదాపు నలభై శాతం స్థలంలో ఇళ్లు నిర్మించారు మిగిలిన స్థలాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయనున్నారు. టౌన్‌షిప్‌ను మొత్తం 117 బ్లాక్‌లుగా విభజించారు. G+9, G+10, G+11 అంతస్తులు చొప్పున ఈ టౌన్‌షిప్ నిర్మించారు.