Telangana Ring Rail Project : తెలంగాణలో రైల్వే కెనెక్టివిటీని మరింత పెంచేందుకు కీలకమైన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గురువారం రైల్వే శాఖ మంత్రితో సమావేశమైన రేవంత్ రెడ్డి కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధరర్‌బాబు, ఉత్తమ్‌కుమారెడ్డి పాల్గొన్నారు. ధిల్లీలోని రైల్ భవన్‌లో ఈ సమావేశం జరిగింది. 


ఈ సమావేశంలో రీజనల్ రింగ్‌ రైలు ప్రాజెక్టు, మచిలీపట్నం వరకు డ్రైపోర్టు, కాజీపేటకు రైల్వే డివిజన్ కేటాయింపు లాంటీ చాలా అంశాలను ప్రస్తావించారు. రీజనల్‌ రంగు రోడ్డుకు సమాంతరంగా ఏర్పాటు చేయబోయే రైల్వే లైన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ఫైనల్ లొకేషన్‌ సర్వేకు రైల్వే బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. మిగతా అనుమతులు కూడా త్వరగానే వచ్చేలా చూడాలని రైల్వే మంత్రికి అభ్యర్థించారు. ఈ ప్రాజెక్టు కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయాలు ఖర్చు అవుతుందని అంచనాతో అంచనాలు సిద్ధం చేశారు. 






తుది సర్వే పూర్చి చేసుకున్న ఔటర్‌ రింగ్‌ రైలు తెలంగాణ అభివృద్ధిలో గేమ్‌ఛేంజర్‌గా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మూడు ఎలైన్‌మెంట్లుగా ఆరు రైలు మార్గాలతో దీన్ని కనెక్ట్ చేయనున్నారు. ఇది లైవ్‌లోకి వస్తే హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉండే పది జిల్లాలతో కనెక్టివిటీ మరింత సులభం అవుతుంది. రాకపోకలు ఈజీగా చేయవచ్చు. జిల్లాల మధ్య కూడా రవాణా సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు.  



అన్ని రైళ్లు సికింద్రాబాద్ రావడంతో రద్దీ విపరీతంగా పెరిగిపపోతోంది. అందుకే ఆలాంటి సమస్యను నివారించిందేకు ఈ ఔటర్ రింగ్ రైల్‌ ప్రతిపాదన తీసుకొచ్చారు. గూడ్స్‌ రైళ్లను ఇక్కడే నిలిపివేయనున్నారు. ఫలితంగా హైదరాబాద్‌లో ఉండే మూడు రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది. సికింద్రాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లనుకూడా దారి మళ్లించవచ్చు. 


ఔటర్ రింగ్ రైల్‌ ప్రాజెక్టు పూర్తి అయితే దేశంలోనే మొదటిది అవుతుంది. బెంగళూరు, చెన్నై, ముంబయి నగర శివారులో టెర్మినళ్లు నిర్మించారే తప్ప ఇలాంటి ప్రాజెక్టు చేపట్టలేదు. ఇది వాస్తవరూపంలో దాల్చితే మాత్రం తెలంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారనుంది. ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగానే రైల్ మార్గం పని చేయనుంది. ఈ ప్రాజెక్టును 2023లో ప్రతిపాదిస్తే.... అదే ఏడాది సెప్టెంబరులో ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు అనుమతి లభించింది. రెండేళ్ల తర్వాత ఆ సర్వే పూర్తి అయింది.  


తెలంగాణలో వివిధ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు కాజీపేటలో రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలని కూడా మంత్రికి ముఖ్యమంత్రి బృందం విజ్ఞప్తి చేసింది. దీని ఫలితంగా తెలంగాణలో ఎగుమతులు, దిగుమతలు, ఎకనామికల్ యాక్టివిటీ పెరుగుతుందని అన్నారు. వీటితోపాటు వికారాబాద్‌-కృష్ణాను కలిపే 122 కిలోమీటర్ల లైన్‌, కల్వకుర్తి-మాచర్ల మధ్య 100 కిలోమీటర్ల రైల్వే లైన్, డోర్నకల్‌-గద్వాల మధ్య 296 కిలోమీటర్లు ట్రాక్, డోర్నకల్‌-మిర్యాలగూడ 97 కిలోమీటర్ల లైన్ పనులను పూర్తి చేయాలని రిక్వస్ట్ చేశారు.  


సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులపై కూడా అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించారు. అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజీ టెక్నాలజీస్‌ ప్రాజెక్ట్, మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఫ్యాబ్‌ ప్రాజెక్ట్‌ క్రిస్టల్‌ మ్యాట్రిక్స్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాలని విజ్ఞప్తి చేశారు. ఈఎంసీ 2.0 పథకం కింద ముచ్చర్లలో హైటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌ ఏర్పాటుకు ఓకే చెప్పాలని సూచించారు.