Heavy rain is falling in many places in Hyderabad : వర్షాభావంతో అల్లాడిపోతున్న హైదరాబాద్ ప్రజల్ని వరుణుడు పలకరించాడు. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ లో పలు చోట్ల పెద్ద ఎత్తున వర్షం పడుతోంది. మాదాపూర్ , శేరిలింగంపల్లి, కంటోన్మెంట్, హకీంపేట. పటాన్ చెరు సహా పలు ప్రాంతాల్లో ఈ భారీ వర్షం పడుతోంది.                             

 తమ ప్రాంతంలో భారీ వర్షం పడుతోందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు.  

 

 

వచ్చే వారం రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అంశాలను విశ్లేషిస్తున్న వారు సోషల్ మీడియాలో చెబుతున్నారు.  

నగరంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు కోరారు. హైదరాబాద్ పోలీసులు కూడా ట్రాఫిక్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారు.