NTR Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం అందింది. జూనియర్ ఎన్టీఆర్ సహా ఇతర కుటుంబ సభ్యులను కూడా టీడీపీ నేతలు ఆహ్వానించారు. మే 20న శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లోని కైతలాపూర్‌లో నిర్వహించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కల్యాణ్ రామ్, పురంధేశ్వరిని కూడా ఆహ్వానించారు. ఇటీవల నిర్వహించిన శత జయంతి వేడుకలకు బాలక్రిష్ణ తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం అందింది. జూనియర్ ఎన్టీఆర్ సహా ఇతర కుటుంబ సభ్యులను కూడా టీడీపీ నేతలు ఆహ్వానించారు. మే 20న శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లోని కైతలాపూర్‌లో నిర్వహించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కల్యాణ్ రామ్, పురంధేశ్వరిని కూడా ఆహ్వానించారు. ఇటీవల నిర్వహించిన శత జయంతి వేడుకలకు బాలక్రిష్ణ తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని కైతలాపూర్ మైదానంలో జయహో ఎన్టీఆర్ వెబ్‌సైట్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ వెబ్‌సైట్ నిర్వహణపై నిన్న చంద్రబాబుతో కమిటీ సమావేశమై, వెబ్‌సైట్ ఆవిష్కరణకు ఎవరెవరిని ఆహ్వానించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ స్వయంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కలిసి ఆహ్వానం అందించారు.
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు, నందమూరి జయకృష్ణ, నందమూరి మోహన కృష్ణ, గారపాటి లోకేశ్వరి, కంటమనేని ఉమా శ్రీనివాస్ ప్రసాద్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, కాట్రగడ్డ రుక్మాంగదరరావులకు ఆహ్వాన పత్రాలు అందించారు. నందమూరి రామకృష్ణతో కలిసి వెళ్లి టీడీ జనార్దన్ నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానాలను అందించారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా విదేశాల్లోని తెలుగువారు కూడా ఆ యుగపురుషుణ్ని ఘనంగా స్మరించుంటున్నారు. ఖండాంతరాల్లో స్థిరపడిన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడిక క్కడ ఎన్టీఆర్ విగ్రహలు పెట్టి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సావనీర్ కమిటీ ఛైర్మన్‌గా టీడీ జనార్ధన్ ఉన్నారు. గత నెల 28వ తేదీన విజయవాడలో జరిగిన సభకు చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ ఒకే వేదికపై కనిపించారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వంద సభలు నిర్వహించి, మే 28 శత జయంతిని గొప్పగా నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, దేశ వ్యాప్తంగా 10 చోట్ల, అంతర్జాతీయ స్థాయిలో 47 చోట్ల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని గతంలో మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు.