తెలంగాణలో మే 10 నుంచి 14 వరకు 5 రోజులపాటు జరిగిన ఎంసెట్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగాలకు పరీక్షలు నిర్వహించగా.. మే 12,13,14 తేదీల్లో ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు మే 14తో ముగిశాయి. మే 14న అగ్రికల్చర్‌, మెడికల్‌ ఆన్సర్ కీ విడుదల చేసిన అధికారులు, మే 15న ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. మే 15న సాయంత్రం 8 గంటల నుంచి ఆన్సర్ కీ, విద్యార్థులు రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మే 15న సాయంత్రం 8 గంటల నుంచి మే 17న సాయంత్రం 8 గంటల వరకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసి వెబ్ లింక్ ద్వారా తెలియజేయవచ్చు.


Website


వెబ్‌సైట్‌లో అగ్రికల్చర్, మెడికల్ ఆన్సర్ కీ..
టీఎస్‌ఎంసెట్-2023 అగ్రికల్చర్ & మెడికల్ స్ట్రీమ్ ఆన్సర్ కీని మే 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీపై మే 14న సాయంత్రం 6 గంటల నుంచి మే 16న సాయంత్రం 6 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా మే 16న సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండనున్నాయి.
అగ్రికల్చర్, మెడికల్ ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదుకోసం క్లిక్ చేయండి..


హాజరు 94.11 శాతం.. 
ఈసారి ఎంసెట్ పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్‌కు మొత్తం 3,20,683 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,01,789 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షలకు 65,871 మంది హాజరయ్యారు. తెలంగాణ నుంచి 12,561 మంది విద్యార్థులు పరీక్షలకు రాయలేదు. ఇక ఏపీ నుంచి 6,333 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు.


మే చివరివారంలో ఫలితాలు..
మే 10 నుంచి 14 వరకు జరిగిన ఎంసెట్‌ పరీక్షల ఫలితాలను మే చివరివారంలో విడుదలచేయనున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు మే 26 నుంచి 30 తేదీల మధ్యన ఫలితాలను విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు భావిస్తున్నారు. ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ నిబంధనను ఎత్తివేయడంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకణ, ఫైనల్‌ కీ విడుదల, నార్మలైజేషన్‌ ప్రక్రియ అనంతరం ఫలితాలను విడుదల చేస్తామని జేఎన్టీయూ అధికారులు వెల్లడించారు.  


Also Read:


మే 15 నుంచి ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు, తరగతుల ప్రారంభం ఎప్పుడంటే?
ఏపీలోని జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ ప్రక్రియ మే 15 నుంచి ప్రారంభంకానుంది. బోర్డు అనుమతించిన ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలని, అందుకు విరుద్ధంగా ఎవరు చేపట్టినా శిక్షార్హులని ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ ఎంవీ శేషగిరి బాబు స్పష్టం చేశారు. ఈమేరకు మే 10న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలు చేపట్టేందుకు మొదటి దశ షెడ్యూల్‌ను విడుదల చేశామని, ఆమేరకు విద్యా సంస్ధలు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించాలని ఆయన తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..