Hyderabad TCS: ప్రముఖ సంస్థ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) హైదరాబాద్ లో క్యాంపస్ ను ఏర్పాట్లు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆరు నుంచి ఏడు నెలల్లో ఈ క్యాంపస్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ముందుగా 700 మంది నిపుణులు పని చేయడానికి సదుపాయాలు ఉంటాయని టీసీఎస్ హైదరాబాద్ రీజనల్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ (కమ్యూనికేషన్స్, టెక్నాలజీ బిజినెస్) వి రాజన్న తెలిపారు. టీసీస్ కు హైదరాబాద్ రెండో అతిపెద్ద కేంద్రం. ఇప్పటి వరకు హైదరాబాద్ లో 7 ప్రాంగణాలు ఉన్నాయి. 2006లో హైదరాబాద్ లో 4 వేల మంది ఉద్యోగులు ఉంటే 20222 నాటికి వారి సంస్య 90 వేలకు చేరింది. ఇందులో 37.4 మంది మహిళలే కావడం గమనార్హం. ఆదిభట్ల ప్రాంగణంలో 28 వేల మంది నిపుణులకు సరిపడా స్పేస్ ఉండగా.. 16 వేల మంది పని చేస్తున్నారని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ ఐటీ పరిశ్రమలో లక్షన్నర మంది నిపుణులకు కొత్తగా కొలువులు లభిస్తే... అందులో 10 వేల 800 మంది టీసీఎస్ లోనే ఉద్యోగాలు పొందారని చెప్పారు. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో టీసీఎస్ కు 10-12 శాతం వాటా ఉందని వివరించారు. భవిష్యత్తులో సెమీకండక్టర్ విభాగంలో నిపుణులకు భారీ ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు రాజన్న తెలిపారు. 


హైదరాబాద్ నుంచే 1300 మంది క్లైంట్లకు సేవలు


టీసీఎస్ హైదరాబాద్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కు కేంద్రంగా ఉంది. నెక్స్ట్ జనరేషన్ నెట్ వర్క్ ఎక్స్ లెన్స్ కేంద్రం, కస్టమ్ సిలికాన్ ఎక్స్ లెన్స్ కేంద్రం, క్లౌడ్ ఎక్స్ పీరియన్స్ కేంద్రం వంటివి హైదరాబాద్ లో ఉన్నాయని టీసీఎస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పి. ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ నుంచి టీసీఎస్ అంతర్జాతీయంగా 1300 మంది క్లైంట్లకు సేవలు అందిస్తున్న్నారు. స్టూడెంట్ డెవలప్ మెంట్ కార్యక్రమం కింద టీసీఎస్ హైదరాబాద్ కొత్త తరం టెక్నాలజీల్లో 20 వేల మంది విద్యార్థులకు అండగా నిలిచిందన్నారు. యూత్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్ కింద 4 వేల మందికి శిక్షణ ఇచ్చిందన్నారు. ప్రముఖ కార్ల కంపెనీతో కలిసి భారత్ కోసం టీసీఎస్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల వాడకం, ఛార్జింగ్ టెక్నాలజీ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని టీసీఎస్ గ్లోబల్ హెడ్ అయ్యస్వామి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి గోవాలో టీసీఎస్ కు ఫ్రోటోటైప్ ఉత్పత్తులను తయారు చేసే కేంద్రం ఉంది. వైర్ లెస్ ఛార్జింగ్ సిస్టమ్ బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్స్ వంటి వాటిని టీసీఎస్ అభివృద్ధి చేస్తోందని ఆయన చెప్పారు. 


రాంగ్ సైడ్ డ్రైవింగ్ లో వచ్చే కారును ఆబ్జెక్ట్ డిటెక్షన్ అల్గారిథమ్ గుర్తిస్తుందట..


అటానమీ డ్రైవింగ్, కనెక్టెడ్ సర్వీసెస్, ఇన్నోైన్ మెంట్ కోసం టీసీఎస్ ఆటోమోటివ్ ఇంజినీరింగ్ సర్వీసెస్-ఆటోమోటివ్ సొల్యూషన్లను అభివృద్ధి చేస్తోంది. అటానమస్ డ్రైవింగ్ లో లెవల్ - 4 వరకూ వివిధ ఫీచర్ల ఉంటాయి. సెల్ఫ్ పార్కింగ్, పార్కింగ్ ప్లేస్ గుర్తింపు, లేన్ చేంజింగ్ కంట్రోల్ సిస్టమ్ వంటి అటానమస్ వెహికల్ సొల్యూషన్లు టీసీఎస్ అభివృద్ధి చేస్తోందని అయ్యస్వామి తెలిపారు. మూడు ప్రోటోటైప్ అటానమస్ కార్లను కంపెనీ పరీక్షిస్తోందని అన్నారు. అటానమస్ కారుకు డేటా వేగం సెకనుకు 1 జీబీ మేర అవసరం అవుతుంది. 144 టెరాఫ్లాప్స్ కంప్యూటేషనల్ పవన్ కావాలి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ లో వచ్చే కారును ఆబ్జెక్ట్ డిటెక్షన్ అల్గారిథమ్ గుర్తించగలదని తెలిపారు.