రామోజీ గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీ రావు అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ రావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రామోజీ ఫిల్మ్‌సిటీలోని రామోజీ రావు నివాసం నుంచి ఆయన పార్థివదేహంతో అంతిమయాత్ర ప్రారంభం అయింది.


ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం ఢిల్లీలో ఉండగా.. అక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు అన్నీ దగ్గరుండి చూసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు ఆదేశాలు అందాయి.


రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ఎల్‌బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి పరిశీలించారు. రామోజీరావు అంత్యక్రియలకు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న దృష్ట్యా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఎస్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.




రామోజీరావు అంత్యక్రియలకు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఎస్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.