కేంద్ర ప్రభుత్వం బియ్యం కొంటామని చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజా సింగ్ అన్నారు. 40 లక్షల టన్నుల బియ్యానికి అదనంగా తెలంగాణ నుంచి మరో ఆరు లక్షల టన్నులు బియ్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతుల పక్షాన ఎప్పుడూ ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


‘తెలంగాణ మంత్రులు ఢిల్లీ ఎందుకు వెళ్లారో అర్థం కావడం లేదు. రాష్ట్ర మంత్రుల ఢిల్లీ పర్యటన అర్థం లేనిది. వాళ్లు ఢిల్లీ వెళ్లక ముందు, వెళ్లొచ్చిన తరువాత కూడా బియ్యం కొంటామనే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ టీఆర్ఎస్ సర్కార్ తమ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేసింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు దీన్ని రాజకీయం చేయాలనే దురుద్దేశంతో పని లేక ఢిల్లీకి వెళ్లి ప్రజల డబ్బును వృథా చేశారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారో తప్ప.. రాష్ట్ర మంత్రులు ఢిల్లీ పర్యటనతో సాధించిందేమీ లేదు.


ఆడంబరాలకు, విహార యాత్ర కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ తమ పనులు చక్క బెట్టుకుంటున్నారే తప్ప టీఆర్ఎస్ నేతలు, మంత్రులకు ప్రజల శ్రేయస్సు ఏ మాత్రం పట్టకపోవడం సిగ్గుచేటు. గతంలో చెప్పిన విధంగానే యాసంగిలోనూ ముడి బియ్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ కేసీఆర్ యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండబోవని, రైతుల నుండి ధాన్యం కొనబోమని ప్రకటనలు చేశారు. భవిష్యత్తులోనైనా రైతులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలను ఇకనైనా ఉపసంహరించుకోవాలి. అబద్ధాల లెక్కలతో ప్రజలను మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై నెపం వేసి తప్పించుకోవాలనే ప్రయత్నం సీఎం కేసీఆర్ కు ఏమాత్రం సరికాదని’ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.







రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మెడలు వంచుతామనడం సరికాదని హితవు పలికారు. మెడ మీద కత్తి పెడితే బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రానికి లేఖ రాసిచ్చినట్లుగా చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కేంద్రం మెడలు వంచినట్లుగా చెప్పడం సిగ్గు చేటు అన్నారు. ఇకనైనా రాజకీయాలు పక్కనపెట్టి, రాష్ట్ర రైతులు, ప్రజల ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేయాలని రాజా సింగ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించి వరి ధాన్యాన్ని పూర్తిగా రైతుల నుండి కొనుగోలు చేసే  విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..
Also Read: Anandayya Medicine: ఆనందయ్య ఒమిక్రాన్ మందుకు ఎదురుదెబ్బలు, ప్రభుత్వం నుంచే.. పంపిణీ సాగేనా?


Also Read: New Study: కోపం, అసహనం పెరిగిపోతోందా? మీరు తినే ఆహారం కూడా వాటికి కారణమే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి