Maha Shivaratri 2025:  శివరాత్రి మహాపర్వదినం అంటే శైవ క్షేత్రాల వద్ద భక్తుల రద్దీ ఏ స్దాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. అందులోనూ తెలంగాణలో ప్రసిద్ద శైవక్షేత్రమైన కీసరగట్టు మహాశివుని ఆలయానికి తెల్లవారు జాము నుంచే భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. భక్తుల తాకిడి పెరిగినప్పుడు,వారిని అదుపుచేయడం ఆలయ సిబ్బందితోపాటు పోలీసులకు పెద్ద సాహసమే. కీసరగట్టు శైవ క్షేత్రం వద్ద భక్తుల తాడికి దృష్టిలో ఉంచుకొని సిబ్బందితోపాటు రాచకొండ పోలీస్ కమిషనర్‌ సుధీర్ బాబు ఆలయం వద్దే విధుల్లో ఉంటున్నారు.  


మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రారంభమైన కీసరగుట్ట బ్రహ్మోత్సావాల బందోబస్తు ఏర్పాట్లను రాచకొండ కమిషనర్ సుదీర్ బాబు దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు అస్వస్థతకు గురయ్యారు. కాలికి గాయం కావడంతో స్పృహతప్పి పడిపోయాడు. అరవై ఏళ్లకు పైగా వయస్సున ఆ భక్తుడు తీవ్ర రక్తస్రావం కాడంతో అక్కడే కూలబడిపోయాడు. అక్కడే ఉన్న రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌  గాయడపడ్డ భక్తుణ్ని గమనించి వెంటనే వైద్య సిబ్బందిని అప్రమత్రం చేశారు. ఏదో వైద్య సిబ్బందిని పిలిచి చెప్పి వదిలేయ లేదు. తానే స్వయంగా దగ్గరుండి మరీ సీపీఆర్‌ చేశారు. ప్రాథమిక చికిత్స అందించారు రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు.


Also Read: ముక్కంటి, ముక్కోపి, తిక్క శంకరుడు.. పాటల్లో శివతత్వాన్ని బోధించిన కళాతపస్వి!


తర్వాత వెంటనే మెరుగైన వైద్యం కోసం గాయపడిన భక్తుణ్ని అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భద్రత చర్యలు పర్వవేక్షిస్తూనే మరోవైపు భక్తుడి ప్రాణాలు కాపాడేందుకు కమిషనర్ చూపిన చొరవను భక్తులు అభినందిస్తున్నారు. రద్దీగా ఉన్న సమయంలో అందులోనూ శివరాత్రి వంటి అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో భక్తులు రద్దీ విపరీతంగా ఉంటుంది. కొందరి అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరుగుతుండటం సర్వసాధారణం. అలా ఎవరైనా ప్రమాదానికి లోనైతే , మనకేంటి అని వదిలేయకుండా, తగిన చొరవ తీసుకుని మానవత్వంతో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉంటుందనేది గుర్తిచేసేలా రాచకొండ పోలీస్ కమిషనర్ వ్యవహరించారు. ఆయన దాత్రుత్వం చూపిన వైనం ఆదర్శంగా నిలుస్తోంది.


అనంతరం కమిషనర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఉత్సవాల ప్రారంభానికి 15 రోజుల ముందుగానే తాము భద్రత ఏర్పాట్లు మొదలుపెట్టామని, అన్ని స్థాయిల సిబ్బందికి తగిన సూచనలు చేశామని, అనేకసార్లు సమావేశాలు నిర్వహించామని సిపి తెలిపారు. రాచకొండ నుంచి మాత్రమే కాకుండా  హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ నుంచి కూడా సివిల్, ట్రాఫిక్ విభాగాల అధికారులు, సిబ్బంది మహశివరాత్రి బ్రహ్మోత్సవాల బందోబస్తు విధుల్లో పాల్గొన్నారని వివరించారు. మొత్తం 2500 మంది అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించామని తెలిపారు. విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేశామని, ఆకస్మాత్తుగా తోపులాటలు, ట్రాఫిక్ జాములు ఇబ్బంది లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఆలయ ప్రాంగణంలో అన్ని వైపులా ఏర్పాటు చేసిన సిసిటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. వీఐపీలతోపాటు సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా దైవదర్శనం జరిగేలా తగువిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.


Also Read: చతురస్రాకార శివలింగం భీరంగూడ గుట్ట ఆలయ ప్రత్యేకం- శివరాత్రి రోజున పోటెత్తిన భక్తజనం