Celebrity Drug Case: డ్రగ్స్ కేసులో కబాలి సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సినీ నటులు, క్రీడాకారులు, వైద్యులు, వ్యాపారస్తులకు కొకైన్ సరఫరా చేశారని పోలీసులు చెబుతున్నారు. ఈక్రమంలోనే రిమాండ్ రిపోర్టులోనే ఇదే విషయం పేర్కొన్నారు. కేపీ చౌదరి దందా, ఆయన వద్ద డ్రగ్స్ కొన్నవారి జాబితా బ్యాంకు లావాదేవీలు, ఫోన్ సంబాషణలు, వాట్సాప్ చాటింగ్ లు, డ్రగ్స్ పార్టీల ఫొటోలను నిందితుడు కేపీ చౌదరి గూగుల్ డ్రైవ్ లో భద్రపరుచుకున్నారు. అయితే వీటిని పోలీసులు వెలికితీశారు. అందులో ఉన్న ఆధారల మేరకు పలువురు సెలబ్రిటీలకు, ఇతర వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 14వ తేదీన కేపీ చౌదరి గోవా నుంచి హైదరాబాద్ కు 100 గ్రాముల కొకైన్ తీసుకురాగా.. అందులో 12 గ్రాముల కొకైన్ ను విక్రయించారని పోలీసులకు వివరించారు. దానిని ఎవరికి అమ్మాడనేది తేల్చడంపై పోలీసులు దృష్టి పెట్టారు. మిగతా 88 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.


అయితే ఈ వ్యవహారంలో అషురెడ్డి ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. కొందరు వ్యక్తులతో నాకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న కథనాలన్నీ అవాస్తవమన్నారు. తనపై అలా దుష్ర్పచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తన ఫోన్ నెంబర్ ను బహిరంగంగా పోస్ట్ చేయడం కూడా సరికాదని పేర్కొన్నారు. ఓ క్రీడాకారిణి నివాసంలో డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించగా. కొద్ది రోజులు క్రితం అద్దె కోసం కేపీ చౌదరి ఇంటిని అడాగనని చెప్పుకొచ్చారు. అంతే తప్ప ఆ ఇంట్లో వారు ఏం చేశారనేది తనకు తెలియదని చెప్పారు.     


సెలబ్రిటీలకు డ్రగ్స్ అమ్మినట్లు అంగీకరించిన కేపీ!


కేపీ చౌదరి సంచలన విషయాలు బయట పెట్టినట్లు కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. పన్నెండు మందికి తాను డ్రగ్స్ సరఫరా చేసినట్లు కేపీ చౌదరి  అంగీకరించాడని, అందులో సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ''బెజవాడ భరత్, తేజ, రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, ఠాగూర్ ప్రసాద్, శ్వేత నా దగ్గర డ్రగ్స్ కొన్నారు'' అని కేపీ చౌదరి వెల్లడించినట్లు కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.


అషురెడ్డితో పాటు సురేఖా వాణి ఫోన్ నెంబర్లు..