Nandamuri Balakrishna Participated in Nandamuri Padmaja Funeral: దివంగత ఎన్టీఆర్ పెద్ద కోడలు, నందమూరి జయకృష్ణ సతీమణి నందమూరి పద్మజ అంత్యక్రియలు బుధవారం పూర్తయ్యాయి. నందమూరి కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. తన వదినకు చివరిసారిగా వీడ్కోలు పలికారు బాలకృష్ణ. వదిన మరణంతో కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య ఆమె పాడె మోసి కడసారి వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న పద్మజ... మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించగా... బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

Continues below advertisement






Also Read: షూటింగులు ఆపితే అడుక్కు తినాలి... కార్మికుల ఆకలి బాధలపై మాట్లాడరే? - నాయకులపై వీఎన్ ఆదిత్య ఫైర్


బాలయ్య ఎమోషనల్


తన వదిన పద్మజ తనను అమ్మలా చూసుకున్నారని బాలయ్య ఎమోషనల్ అయ్యారు. 'నాన్న ఎన్టీఆర్ షూటింగ్స్ నిమిత్తం మద్రాస్‌లో ఉండేవారు. ఆయనకు తోడుగా అమ్మ తనని చూసుకునేవారు. మా వదిన మాకు అమ్మతో సమానం. అన్నీ తానై చూసుకునే వారు. స్కూలుకు వెళ్లేటప్పుడు అన్నీ ఆవిడే దగ్గరే చూసుకుండేవారు. ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా మమ్మల్ని చూసుకునేవారు. ఫ్రీడమ్ ఇస్తూనే స్ట్రిక్ట్‌గా క్రమశిక్షణతో పెంచారు. మా ఇష్టాయిస్టాలను ప్రతీది కూడా ఆవిడ చూసుకునేవారు. ఆవిడ లేరనే నిజం జీర్ణించుకోలేకపోతున్నా. ఇది మాటలకు అందని శోకం. భగవంతుడు వదిన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నా.' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.