తెలుగు చిత్రసీమలో చిత్రీకరణలు నిలిచి పదిహేను రోజులు. వేతనాలు 30 శాతం పెంచాలని కార్మికులు పట్టుబట్టి కూర్చుకున్నారు. అసలే విజయాలు కరువైన ఈ తరుణంలో అందరికీ అంత పెంచలేమని నిర్మాతలు చెబుతున్నారు. ఈ సమ్మెను పరిష్కరించడానికి మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు (మెగాస్టార్ మాస్టర్ ప్లాన్... చిరంజీవి రంగంలోకి దిగడంతో మారిన సీన్!). అందరితో ఆయన చర్చలు సాగిస్తున్నారు. అయితే... ఈ సమ్మె మీద సీనియర్ దర్శకులు వీఎన్ ఆదిత్య తనదైన శైలిలో స్పందించారు. నాయకుల మీద మండిపడ్డారు.  

Continues below advertisement

కార్మికుల ఆకలి బాధలకు సమాధానం ఎక్కడ?సమ్మె వల్ల కడుపులు కాలుతున్న కార్మికులు లక్షల్లో ఉన్నారని, తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ల ఆకలి బాధలకు ఏ యూనియన్ నాయకుడు సమాధానం చెబుతారని వీఎన్ ఆదిత్య ప్రశ్నించారు. మన కళామతల్లి రంగంలో పని దొరకడం ఒక్కటే మొదటి ప్రాధాన్యత అని... అటువంటి పనిని ఆపే సంఘాలు ఉన్నా ఒకటేనని, ఊడినా ఒకటేనని ఆయన ఘాటుగా స్పందించారు.

కార్మికులకు పని ఉంటే గానీ డబ్బు, అన్నం దొరకని పరిశ్రమలో... ఆ పనిని ఆపడం ద్వారా ఎవరూ ఎవరినీ ఉద్దరించలేరని వీఎన్ ఆదిత్య పేర్కొన్నారు. ఒకవేళ చేతనైతే యూనియన్లు అన్నీ కలిసి ఒక్క రోజు షూటింగ్ జరిగేందుకు దోహదపడాలి గానీ ఆపడానికి కాదని ఆయన వివరించారు. నాయకులకు సామర్ధ్యం ఉంటే షూటింగులకు అంతరాయం కలగకుండా సమస్యలకు పరిష్కారం తీసుకు రావాలని వీఎన్ ఆదిత్య అన్నారు.

Continues below advertisement

పరోక్షంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మద్దతు!సమ్మె విషయంలో తన అభిప్రాయాలు వెల్లడించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మీద కొందరు కార్మికులు, నాయకులు మండిపడ్డారు. ఆ అంశం పట్ల వీఎన్ ఆదిత్య స్పందించారు. టీజీ విశ్వప్రసాద్ పేరు తీయలేదు గానీ సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ చూస్తే పరోక్షంగా మద్దతు ఇచ్చారని అర్థం అవుతోంది.

Also Readనాలుగు రోజుల్లో 400 కోట్లు... వీకెండ్ తర్వాత నిలబడిందా? ఇండియాలో రజనీ మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయ్?

కారు డ్రైవర్లకు, ప్రొడక్షన్ బాయ్ వంటి వాళ్ళకు డబ్బులు ఎగ్గొట్టే బడా నిర్మాతలను ఏమీ అనలేని నాయకులు... ఆయన మీద విరుచుకుపడతారని వీఎన్ ఆదిత్య ఘాటుగా స్పందించారు. ఇంకా "ఒక్క వ్యక్తి సినిమాల్లోకి వచ్చి డబ్బులు వస్తే తీస్తాను, రాకపోతే వేరే వ్యాపారంలో పెడతానని అనుకోకుండా... లాభము వచ్చినా, నష్టం వచ్చినా సినిమాలే తీస్తూ... తన బయటి వ్యాపారాలలో వచ్చిన లాభాలు కూడా సినిమా రంగంలోకి మళ్లిస్తూ పదేళ్లలో దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టుకుని... ఫ్లాపులు, ట్రోలింగులకు ఎదురీదుతూ మొండిగా నిలబడితే... ఆయన్ని ఎంకరేజ్ చేసి మరిన్ని మంచి సినిమాలు చేసేలా ప్రోత్సహించాల్సింది పోయి, అబద్ధపు ప్రచారాలతో, స్వార్ధపూరిత రాజకీయాలతో, కుల వివక్షలతో ఈ రంగం మీద పెట్టుబడిని బయటి రంగాలకు మళ్ళించేలా మన ప్రవర్తన ఉంటే ఎవడికిరా నష్టం?'' అని వీఎన్ ఆదిత్య పేర్కొన్నారు. ఏ కార్మిక సంఘమైనా కార్మికులకు అన్యాయం చేసిన నిర్మాత మీద పడాలి గానీ వేల మందికి పని కల్పించే నిర్మాతల మీద కాదన్నారు. టీజీ విశ్వప్రసాద్ పదేళ్లలో పెట్టిన భోజనాల ఖర్చు పది పెద్ద సినిమాల బడ్జెట్టు అన్నారు. చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుంది కానీ సమ్మె వల్ల కాదన్నారు. సినిమా ఇండస్ట్రీలో పెద్దలు చెప్పేది కూడా అదేనని తెలిపారు.

Also Readఊహించని విధంగా పడిపోయిన వసూళ్లు... NTR, Hrithik సినిమాకు బాక్సాఫీస్‌ బరిలో షాక్