ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు పాన్ ఇండియా రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనతో సినిమా అంటే ఇండియన్ ఆడియన్స్ అందరికీ తెలిసిన ఆర్టిస్టులను తీసుకోవాలి కదా! బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా 'జవాన్' వంటి హిట్ సినిమా తీసిన తమిళ దర్శకుడు అట్లీ కుమార్ (Director Atlee Kumar)కి ఆ విషయం తెలుసు. అందుకే తన సినిమాలోకి రాజమాతను తీసుకు వచ్చారట.
అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో రమ్యకృష్ణ!Allu Arjun and Atlee Movie Update: అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'బాహుబలి'లో రాజమాత శివగామి పాత్రలో అద్భుతమైన నటన కనబరచడం మాత్రమే కాదు... సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు రమ్యకృష్ణ. ఇప్పుడు ఆమెను అల్లు అర్జున్ అట్లీ సినిమాలో కీలక పాత్రకు తీసుకున్నారు.
టాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్స్ మహేష్ బాబు, ప్రభాస్, సాయి దుర్గా తేజ్ తదితరుల సినిమాలలో రమ్యకృష్ణ నటించారు. బన్నీ, ఆవిడ కాంబినేషన్‌లో ఫస్ట్ సినిమా ఇది.
అల్లు అర్జున్ జంటగా దీపికా పదుకోన్!సైన్స్ ఫిక్షన్ కథతో అల్లు అర్జున్ అట్లీ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి దీపికా పదుకోన్ (Deepika Padukone) నటిస్తున్నారు. ఆవిడ కాకుండా మరొక ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. ఒక పాత్రకు మృణాల్ ఠాకూర్, మరొక హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
Also Read: నాలుగు రోజుల్లో 400 కోట్లు... వీకెండ్ తర్వాత నిలబడిందా? ఇండియాలో రజనీ మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయ్?
మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే.... ఇందులో ఒక విలన్ రోల్ కూడా ఉందని, ఆ పాత్రకు నేషనల్ క్రష్ రష్మికా మందన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. తండ్రి కొడుకులుగా కనిపిస్తారని, విలన్ రోల్ కూడా ఆయనే చేస్తున్నారని టాక్. అయితే దీపికను తప్ప మరొకరిని తమ సినిమాలోకి తీసుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించలేదు.
అల్లు అర్జున్ అట్లీ సినిమాను సన్ పిక్చర్స్ పతాకం మీద కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ'ని ప్రొడ్యూస్ చేసింది కూడా ఆయనే. మరొక భారీ పాన్ ఇండియా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పుష్ప విజయం నేపథ్యంలో అల్లు అర్జున్ మీద ఉత్తరాది ప్రేక్షకులలో కూడా ఆసక్తి నెలకొంది. ఆల్రెడీ 'జవాన్' సినిమాతో అక్కడ హిట్ అందుకున్న అట్లీ ఎటువంటి సినిమా తీస్తారో అనే ఆసక్తి దక్షిణాది ప్రేక్షకులలో ఉంది. ఈ మూవీకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తారని టాక్.
Also Read: ఊహించని విధంగా పడిపోయిన వసూళ్లు... NTR, Hrithik సినిమాకు బాక్సాఫీస్ బరిలో షాక్